Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొండల మధ్య అనుమానాస్పద హత్యలు. సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు. సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

Big TV Live 2 weeks ago

Thriller Movie on OTT : ఓ ప్రశాంతమైన కొండ ప్రాంతం… చుట్టూ పచ్చని అడవులు… బయట ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా జీవిస్తున్న ఓ తల్లి. కానీ ఒక్కసారిగా ఆమె కూతురు ఒంటి నిండా రక్తంతో ఇంటి తలుపు తడితే ?

ఆ రక్తం ఎవరిది అని అడిగితే ఆమె చెప్పే సమాధానం మరింత భయపెడితే ? కూతురు చేసిన తప్పును దాచేందుకు ప్రయత్నించిన తల్లి, ఆ ఘటన వెనుక దాగి ఉన్న నిజాన్ని వెతుకుతుండగా… పరిస్థితులు ఒక్కొక్కటిగా తన చేతుల్లోంచి జారిపోతే ? జూలియన్నే మూర్, సిడ్నీ స్వీనీ ప్రధాన పాత్రల్లో నటించిన 'Echo Valley' ఇలాంటి తల్లి కూతుళ్ల బంధం చుట్టూ సాగే మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కింది. మరి ఆ రక్తంతో కూతురు ఎందుకు ఇంటికి వచ్చింది ? ఆమె ఏం దాచి పెడుతోంది ? కూతురిని కాపాడేందుకు తల్లి ఎంత దూరం వెళ్తుంది ? అనే వివరాలు తెలియాలంటే ఈ సినిమా స్టోరీపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కేట్ గారెట్సన్ తన భర్త మరణం తర్వాత పెన్సిల్వేనియాలోని ఏకాంతమైన ఎకో వ్యాలీలో గుర్రాలతో ప్రశాంతమైన జీవితం గడుపుతుంటుంది. బయట ప్రపంచానికి దూరంగా ఉన్న ఆ ప్రదేశమే ఆమెకు ఓ ఆశ్రయం. కానీ కేట్ జీవితంలో ఉన్న పెద్ద ఆందోళన ఆమె కూతురు క్లేర్. తల్లితో క్లేర్‌ కు అనుబంధం ఉన్నప్పటికీ, ఆమె జీవితంలో కొన్ని సమస్యలు కేట్‌ ను ఎప్పుడూ కలవర పెడుతుంటాయి. ఒక రోజు క్లేర్ అకస్మాత్తుగా తల్లి ఇంటికి వస్తుంది.

అయితే ఈసారి ఆమె కనిపించే తీరు కేట్‌ ను షాక్‌ కు గురిచేస్తుంది. భయంతో వణికిపోతూ, ఒంటినిండా రక్తంతో ఉన్న కూతురిని చూసిన కేట్ ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. క్లేర్ చెప్పే విషయం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తుంది. తన కూతురు ఏదో తీవ్రమైన ఘటనలో చిక్కుకుందని అర్థం చేసుకున్న కేట్, ఆమెను కాపాడేందుకు నిజాన్ని దాచాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఓసారి అబద్ధం చెప్పడం మొదలు పెట్టిన తర్వాత దాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. కేట్ కూతురి కోసం తీసుకునే ప్రతి నిర్ణయం ఆమెను మరింత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెడుతుంది.

ఆమెకు కనిపించే ఆధారాలు, కూతురు చెప్పే మాటలు ఒకదానితో ఒకటి సరిపోకపోవడంతో అసలు నిజం ఏంటనే అనుమానం పెరుగుతుంది. క్లేర్ నిజంగా బాధితురాలా ? లేక ఈ మొత్తం ఘటన వెనుక ఆమెకు కూడా ఏదైనా పాత్ర ఉందా ? ఆ రక్తం ఎవరిది ? కేట్ తన కూతురిని కాపాడేందుకు ఎంతటి హద్దులు దాటుతుంది ? చివరికి బయటపడే నిజం తల్లి కూతుళ్ల బంధాన్ని ఎలా మార్చేస్తుంది ? అనేదే సినిమాలో అసలు సస్పెన్స్.

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

తెలుగులో అందుబాటులో ఉందా?

2025లో Apple TV+లో విడుదలైన ఈ సినిమా సుమారు 1 గంట 44 నిమిషాల నిడివితో ఉంటుంది. మైఖేల్ పియర్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో జూలియన్నే మూర్ కేట్‌గా, సిడ్నీ స్వీనీ క్లేర్‌గా, డొమ్నాల్ గ్లీసన్ జాకీ లైమన్‌గా నటించారు. ఫియోనా షా, కైల్ మెక్‌లాచ్లన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. అయితే ఓటీటీలో ఇంగ్లీష్, ఇటాలియన్, స్పానిష్, జపనీస్, జర్మన్, ఫ్రెంచ్ వంటి ఆడియోలు మాత్రమే లిస్ట్ అయ్యాయి. తెలుగు ఆడియో ఇంకా రాలేదు. ఈ సినిమా ‘దృశ్యం’ లాంటి థ్రిల్ ఇస్తుంది. ఓటీటీలో ఒక మంచి స్లో బర్న్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ను చూడాలి అనుకుంటే ఈ మూవీని డోంట్ మిస్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live