Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
LPLలోనే చోటు లేదు.నీ ముఖానికి పాకిస్తాన్ కెప్టెన్సీ అవసరమా ?

LPLలోనే చోటు లేదు.నీ ముఖానికి పాకిస్తాన్ కెప్టెన్సీ అవసరమా ?

Big TV Live 3 weeks ago

Rashid Latif On Shaheen Afridi: పాకిస్తాన్‌ ప్రీమియర్ బౌలర్ గా చెప్పుకునే షాహిన్ అఫ్రిది (Shaheen Afridi), పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది.

ఒకప్పుడు తానే నెంబర్ వన్ బౌలర్ అని రెచ్చిపోయిన షాహిన్ అఫ్రిది, క్రమ క్రమంగా మూలన పడుతున్నాడు. కనుమరుగైపోతున్నాడు. అలాంటి షాహిన్ అఫ్రిదిపైన పాకిస్తాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ (Rashid Latif) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లంకా ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Lanka Premier League 2026 Tournament) షాహిన్ అఫ్రిదికి ఆడే అవకాశం కూడా ఇవ్వడం లేదని హేళన చేస్తూ మాట్లాడారు. అలాంటి వాడికి పాకిస్తాన్ వన్డే కెప్టెన్ పదవి ఇస్తారా ? వెంటనే ఆ పదవి తొలగించండి అంటూ డిమాండ్ చేశారు.

Rana Naved On Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ ను రెండు బంతుల్లోనే ఔట్ చేస్తా..పాక్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు

ఇక రిటైర్మెంట్ తీసుకుని మూలన కూర్చో

షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో పసలేదని… మొదట్లో వేసినంత, ఇప్పుడు బౌలింగ్ చేయడం లేదని పరువు తీశారు. అతడి స్పీడ్ తగ్గడంతో బౌలింగ్ లో పదును పోతోందని విమర్శించారు. పాకిస్తాన్ వన్డే కెప్టెన్ గా కూడా వీడు పీకింది ఏమీ లేదని మండిపడ్డారు. అన్ని మూసుకొని రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొత్త కొత్త బౌలర్లు పాకిస్తాన్ కు దొరుకుతారని.. షాహిన్ అఫ్రిది కంటే తోపు బౌలర్లు ఇప్పుడు వస్తున్నారని గుర్తు చేశారు రషీద్ లతీఫ్. దానిపైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దృష్టి సారించాలని కోరారు.

వన్డే కెప్టెన్ గా షాహిన్ అఫ్రిది అట్టర్ ఫ్లాప్ – రషీద్ లతీఫ్

వన్డే కెప్టెన్ గా కూడా పాకిస్తాన్ ప్రీమియర్ బౌలర్ షాహిన్ అఫ్రిది దారుణంగా విఫలమయ్యాడని హేళన చేశారు రషీద్ లతీఫ్. న్యూజిలాండ్ తో జరిగిన ట్రై సిరీస్ సందర్భంగా మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోవడం, అంతకు ముందు బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ కోల్పోవడం కూడా షాహిన్ అఫ్రిది హయాంలోనే జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక బౌలింగ్ లో కూడా మనోడు చాలా దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్నాడని పరువు తీశారు. 150 కి పైగా స్పీడ్ తో బంతులు వేసే షాహిన్ అఫ్రిది, ఇప్పుడు స్పిన్నర్ లాగా వేస్తున్నాడని హేళన చేశారు. 120 కంటే తక్కువగానే వరుసగా బంతులు వేస్తున్నాడన్నారు. అందుకే లంకా ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Lanka Premier League 2026 Tournament) షాహిన్ అఫ్రిదికి ఛాన్సులు రావడం లేదంటూ ఎద్దేవా చేశారు.

LPLలో షాహిన్ అఫ్రిది వరుస అవమానాలు

పాకిస్తాన్ ప్రీమియర్ బౌలర్ గా చెప్పుకునే షాహిన్ అఫ్రిది లంక ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో క్యాండీ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ టోర్నమెంటులో ఇప్పటి వరకు 6 మ్యాచ్ లలో ఆడాడు. కేవలం 7 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే ఇతని బౌలింగ్ స్లోగా ఉందని… ఇంపాక్ట్ ప్లేయర్ గానే వాడుకుంటున్నారు. మొన్ననైతే, అతడు జట్టులో లేనట్టుగానే ప్రకటించింది క్యాండీ రాయల్స్‌. ఆ అవమానం తట్టుకోలేక లంకా ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ యాజమాన్యానికి కూడా ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో షాహిన్ అఫ్రిదికి క్యాండీ రాయల్స్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇలా తరచు అఫ్రిదికి అవమానాలు ఎదురు అవుతున్నాయి.

Tanveer Ahmed On Babar Azam: టెస్టులను టీ20ల్లా బాబర్ ఆజం ఆడుతున్నాడు..ప్రపంచ క్రికెట్ ను శాసిస్తాడు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live