Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టెస్టులను టీ20ల్లా బాబర్ ఆజం ఆడుతున్నాడు..ప్రపంచ క్రికెట్ ను శాసిస్తాడు!

టెస్టులను టీ20ల్లా బాబర్ ఆజం ఆడుతున్నాడు..ప్రపంచ క్రికెట్ ను శాసిస్తాడు!

Big TV Live 3 weeks ago

Tanveer Ahmed On Babar Azam: వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ (West Indies vs. Pakistan series) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ (Pakistan tour of West Indies, 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే.

వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఈ సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ తొలి మ్యాచ్ ఓటమిపాలైంది. ఆగస్టు 2వ తేదీన రెండో సెకండ్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ పట్టు బిగిస్తోంది. మొదటి ఇన్నింగ్స్ లో బాబర్ ఆజం (Babar Azam) అర్ద సెంచరీ నమోదు చేసి.. సెంచరీ దిశగా దూసుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కొత్త కెప్టెన్ బాబర్ ఆజం గురించి తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాయపడ్డ సింహంలా బాబర్ ఆజం రెచ్చిపోతున్నాడని ప్రశంసించారు. ప్రపంచంలోనే కింగ్ అంటే బాబర్ ఒక్కడేనని కొనియాడారు. తన ఒంటి చేత్తో పాకిస్తాన్ జట్టును గెలిపించే దిశగా దూసుకు వెళ్తున్నాడని వెల్లడించారు.

బాబర్ ఆజం ముందు కోహ్లీ, గిల్ తలవంచాల్సిందే!

వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ (West Indies vs. Pakistan) మధ్య రెండవ టెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో బాబర్ ఆజం బ్యాటింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్. మొదటి టెస్ట్ లో ఓడిపోయినప్పటికీ.. రెండో టెస్టులో మాత్రం బాబర్ ఆజం సేన ముందుకు దూసుకు వెళ్తుందని వెల్లడించారు. బాబర్ ఆజం అసలు సిసలైన కింగ్ అని ప్రశంసించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు అని ప్రశంసించారు. తీవ్రమైన ఒత్తిడిలోనూ బాబర్ ఆజం ( Babar Aam) అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని ప్రశంసించారు. టెస్ట్ మ్యాచ్ కూడా ఫాస్ట్ గా ఆడుతున్నాడని వెల్లడించారు. ఫామ్ లో లేనప్పుడు విమర్శించిన వాళ్లకు బాబర్ ఆజం తన బ్యాట్ తోనే ఆన్సర్ ఇచ్చాడని పేర్కొన్నారు.

విమర్శకులకు తన బ్యాట్ తోనే బాబర్ ఆన్సర్ ఇచ్చాడు

బాబర్ ఆజం మైదానంలో ఉన్నంతసేపు పాకిస్తాన్ అభిమానులు ఫుల్ జోష్లో ఉంటారని తెలిపారు. అతడు స్ట్రైకింగ్ చేసినంతసేపు పాకిస్తాన్ కచ్చితంగా విజయ అవకాశాలను పెంచుకుంటుందని వివరించారు. అలాంటి బాబర్ ఆజం ముందు విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్ గిల్ పనికిరారని హేళన చేస్తూ మాట్లాడారు. టెస్టులను కూడా టి20 లాగా ఆడే సత్తా కేవలం బాబర్ సొంతమన్నారు. ఇది ఇలా ఉండగా వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆగస్టు రెండవ తేదీన రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఇందులో వెస్టిండీస్ మొదటి బ్యాటింగ్ చేసి 344 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఫస్ట్ ఇన్నింగ్స్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ 266 పరుగులు చేసింది. ఇందులో అబ్దుల్లా షఫీక్ సెంచరీ చేయగా బాబర్ ఆజం 86 పరుగులు సాధించాడు. 126 బంతులు ఎదుర్కొన్న బాబర్.. పది బౌండరీలతోపాటు ఒకే సిక్సర్ బాదాడు.

Tamim Iqbal Urged Bangladesh Government: టీమిండియా కోసం వాళ్ల కాళ్లు పట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచలనం !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live