Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PDS Rice: హుజూరాబాద్‌లో అక్రమ రేషన్ బియ్యం దందా కలకలం

PDS Rice: హుజూరాబాద్‌లో అక్రమ రేషన్ బియ్యం దందా కలకలం

Big TV Live 3 weeks ago

PDS Rice: స్వేచ్చ బ్యూరో: హుజూరాబాద్ పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కావడంతో నిఘా తక్కువగా ఉంటుందనే అంచనాతో అక్రమ నిల్వలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న మార్కెట్ రోడ్డులోని 'క్యాస రమేష్ కిరాణం' దుకాణంలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు బ్లూకోట్స్ పోలీసులకు ముందస్తు సమాచారం అందింది.

బ్లూకోట్స్ పోలీసులు..

ఈ నమ్మకమైన సమాచారం మేరకు పోలీసులు సదరు కిరాణా షాపుపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ తనిఖీల్లో దుకాణంలో దాచి ఉంచిన సుమారు రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బ్లూకోట్స్ పోలీసులు హుజూరాబాద్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వినోద్‌కు సమాచారం అందించారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ సమాచారం అందుకున్న వెంటనే ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వినోద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని పరిశీలించి, వాటిని సీజ్ చేశారు. అనంతరం ఆ బియ్యాన్ని భద్రపరచడం కోసం స్థానికంగా ఉన్న సమీప రేషన్ డీలర్ షాపునకు తరలించారు.

Also read: Hyderabad Metro: ఢిల్లీ కేంద్ర మంత్రులకు.. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అధికారులు విచారణ..

పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు నిల్వ చేశారా? లేదా అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. సీజ్ చేసిన బియ్యం నమూనాలను తదుపరి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా విక్రయించినా, నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Also read: Fertility Centres: కార్పోరేట్ ఫెర్టిలిటీ సెంటర్ల పై సర్కార్ నయా స్కెచ్.. ఇకపై వరుస దాడులు..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live