Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెట్రోల్ ధరల ఎఫెక్ట్.. అమ్మకాల్లో దుమ్మురేపుతున్న బజాజ్ చేతక్ EV!

పెట్రోల్ ధరల ఎఫెక్ట్.. అమ్మకాల్లో దుమ్మురేపుతున్న బజాజ్ చేతక్ EV!

Big TV Live 2 days ago

Bajaj Chetak EV Sales:పెరుగుతున్న పెట్రోల్ ధరలు ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు మరింత జోష్ అందిస్తున్నాయి. ముఖ్యంగా నగరాల్లో తక్కువ ధరలో రోజువారీ ప్రయాణాలు చేయాలనుకునే వాళ్లు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ కు భారీ డిమాండ్ ఏర్పడింది. వినియోగదారుల నుంచి వస్తున్న బుకింగ్‌లు పెరగడంతో, బజాజ్ ఆటో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది.

మార్కెట్లో దాదాపు 23 శాతం వాటా

బజాజ్ చేతక్ ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే ఈ స్కూటర్ లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. మార్కెట్లో దాదాపు 23 శాతం వాటాతో చేతక్ EV సత్తా చాటుతోంది. ప్రస్తుతం నెలకు సగటున 35 వేల యూనిట్ల వరకు అమ్మకాలు నమోదవుతున్నాయి. టీవీఎస్ ఐక్యూబ్ తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ-స్కూటర్‌గా చేతక్ గుర్తింపు తెచ్చుకుంది.

పెరుగుతున్న వెయిటింగ్ పీరియడ్

డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో కొన్ని నగరాల్లో చేతక్ కోసం వెయిటింగ్ పీరియడ్ కూడా నెలల వరకు చేరింది. బుకింగ్ చేసిన వెంటనే డెలివరీలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడడంతో, కంపెనీ ఇప్పుడు తయారీ సామర్థ్యాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టింది. ఉత్పత్తి పెంచడం ద్వారా కస్టమర్లకు వేగంగా డెలివరీలు అందించాలని బజాజ్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇటీవలే అందుబాటులోకి కొత్త చేతక్ C2501

కంపెనీ ఇటీవల కొత్త చేతక్ C2501 వేరియంట్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ధర మరింత అందుబాటులో ఉండటంతో యువతను ఆకర్షిస్తోంది. స్టైలిష్ డిజైన్‌తో పాటు ఆల్ మెటల్ బాడీ ఈ స్కూటర్‌ కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది. స్మార్ట్ ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీ కారణంగా చేతక్ EV నగర ప్రయాణాలకు మంచి ఆప్షన్ గా మారుతోంది.

చేతక్ EVలో ఫుల్ LED లైటింగ్, టచ్‌ స్క్రీన్ డిస్‌ ప్లే, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, IP67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, గైడ్ మీ హోమ్ లైట్స్ లాంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. 35 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందుబాటులో ఉంది. కుటుంబ వినియోగానికి కూడా అనుకూలంగా ఉండేలా కంపెనీ డిజైన్ చేసింది.

బజాజ్ ప్రస్తుతం చేతక్ EVను C25, C30, C35 అనే మూడు సిరీస్‌లలో విక్రయిస్తోంది. వీటిలో 2.5kWh, 3.0kWh, 3.5kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 153 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

ధరలు ఎలా ఉన్నాయంటే?

చేతక్ C2501 ప్రారంభ ధర రూ.91,504 కాగా, C3001 ధర రూ.1.05 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఫ్లాగ్‌ షిప్ C35 సిరీస్ ధర రూ.1.02 లక్షల నుంచి అందుబాటులో ఉంది. మార్కెట్లో దీనికి TVS iQube, ఏథర్ రిజ్టా, ఓలా S1 వంటి స్కూటర్లు పోటీ ఇస్తున్నాయి. ఫ్యూయెల్ ధరలు పెరుగుతుండటంతో పాటు మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటం, పర్యావరణానికి మేలు చేయడం లాంటి కారణాలతో ఇప్పుడు ఎక్కువ మంది EVలను ఎంచుకుంటున్నారు.

Read Also: వావ్.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే ఇంత లాభమా? నిజంగా వండర్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live