Mouni Divorce : బాలీవుడ్ స్టార్ హీరోయిన్, 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్ గత రెండు రోజులుగా భర్త సూరజ్ నంబియార్‌కి విడాకులు ఇచ్చిందన్న వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.అయితే ఈ కపుల్ నుండి సరైన క్లారిటీ రాకపోవడంతో ఇందులో నిజమెంత అని ఆలోచనలో పడ్డారంతా.కానీ ఎట్టకేలకి అవును మేము ఇపుడు సింగిల్స్ అంటూ విడాకుల వార్తని బయటపెట్టేయడం తో ఓ క్లారిటీకొచ్చారు అంతా..
అసలు విషయం చెప్పేసిన కపుల్
గురువారం నాడు అంటే ఈరోజు వీరిద్దరూ కలిసి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక కామన్ అనౌన్స్ మెంట్ వదిలి తాము విడిపోతున్న విషయం పై క్లారిటీ ఇచ్చారు. పర్సనల్ లైఫ్ పై వస్తున్న రకరకాల రూమర్స్ తమను బాధించాయని, అందుకే వాస్తవాలను ప్రపంచానికి తెలియజేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసలు విషయం చెప్పుకొచ్చింది మౌనీ రాయ్.
also read :బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. 'పెద్ది' కోసం రంగంలోకి శివన్న.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!
మౌనీ రాయ్ సూరజ్ నంబియార్ పెళ్లి విషయానికి వస్తే 2022 జనవరి 27న గోవా వేదికగా అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. మౌనీ రాయ్ బెంగాలీ కావడంతో ఆమె సంప్రదాయం ప్రకారం, అలాగే సూరజ్ నంబియార్ మలయాళీ కావడంతో ఆయన పద్ధతుల ప్రకారం రెండు రకాలుగా వేడుకలు నిర్వహించారు. అప్పట్లో వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా. అయితే నాలుగేళ్ల బంధం తర్వాత, పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఈ జంట తెలిపింది. ఈ కష్టకాలంలో తమ సీక్రెసీ ని అందరూ గౌరవించాలని, అనవసరపు రూమర్స్ తో ఇబ్బంది పెట్టవద్దని వేడుకుంది.ఇకపై తాము కేవలం స్నేహితులుగా మాత్రమే కంటిన్యూ అవుతామని.ఒకరికొకరం గౌరవించుకుంటూనే వేర్వేరు దారుల్లో వెళ్తామని వివరించింది.
కెరీర్ విషయానికి వస్తే
మౌనీ రాయ్ కెరీర్ విషయానికి వస్తే, ఆమె బుల్లితెరపై 'దేవోన్ కే దేవ్.. మహాదేవ్' సీరియల్‌లో సతీ దేవిగా మెప్పించి, ఆ తర్వాత 'నాగిని' సిరీస్‌తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక, అక్షయ్ కుమార్ సరసన 'గోల్డ్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వెండితెరపై కూడా తన ముద్ర వేసింది .ఇక ఈ మధ్య విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం 'బ్రహ్మాస్త్ర: పార్ట్ 1 – శివ'లో నెగటివ్ రోల్‌లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
విడాకుల వార్తలకి ఎండ్ కార్డ్
కేవలం సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. అటు దుబాయ్ లో బిజినెస్ చేస్తున్న సూరజ్ నంబియార్‌తో ఆమె ప్రేమలో పడి, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంది.అయితే ఈమధ్య వీరిద్దరూ కలిసి ఎక్కడా కనిపించకపోవడం, సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం వంటివి జరగడంతో విడాకుల వార్తలకు రెక్కలొచ్చాయి.ఎట్టకేలకి ఈజోడీ ఏ అసలు విషయం బయట పెట్టడంతో విడాకుల వార్తలకి ఎండ్ కార్డ్ పడిపోయింది.

