Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సాధారణ ప్రయాణికురాలిగా ఆదా శర్మ ట్రైన్ జర్నీ.. జనాలు షాక్!

సాధారణ ప్రయాణికురాలిగా ఆదా శర్మ ట్రైన్ జర్నీ.. జనాలు షాక్!

Big TV Live 6 days ago

Adah Sharma Train Journey:సినీ స్టార్స్ సాధారణంగా విమానాలు, లగ్జరీ కార్లలో ప్రయాణించడం చూస్తుంటాం. కానీ, బాలీవుడ్ నటి ఆదా శర్మ మాత్రం రీసెంట్ గా సింపుల్ గా రైల్లో ప్రయాణించి అందరినీ ఆకట్టుకుంటుంది.

అంతే కాదు, తన ప్రయాణానికి సంబంధించిన అన్ని విషయాలను వీడియోగా తీసి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 3 టైర్ కోచ్ లో కోచ్‌లో ప్రయాణిస్తూ, అక్కడి చిన్న చిన్న అనుభవాలను తనదైన సరదా శైలిలో వీడియోను రూపొందించింది. అభిమానులతో ఫొటోలు దిగడం, రైలులోని వాతావరణాన్ని ఆస్వాదించడం, ప్రయాణంలో ఎదురైన సాధారణ క్షణాలను ఆదా ఫన్నీగా చూపించడం ఈ వీడియోలో కనిపించింది.

80 లక్షలకు పైగా వ్యూస్

ఆదా శర్మ షేర్ చేసిన ఈ రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోకు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో ఇప్పటికే 80 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. ఆదా లాంటి స్టార్ సాధారణ ప్రయాణికురాలిలా రైల్లో జర్నీ చేయడం చూసి చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు రైలు ప్రయాణం చేసినా, తమ ఎక్స్ పీరియెన్స్ ను వీడియో తీసి అభిమానులతో పంచుకోవడం అరుదుగా కనిపిస్తుంది. అందుకే, ఈ వీడియో ఇప్పుడు ఆదా అభిమానులతో పాటు నెటిజన్లు క్రేజీగా ఆకట్టుకుంటుంది.

వాస్తవానికి ఆదా శర్మ సోషల్ మీడియాలో చేసే విభిన్నమైన పోస్టులకు నెటిజన్ల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఫన్ జెనరేట్ అవుతూనే ఉంటుంది. ఈ రైలు ప్రయాణంలో కూడా ఆమె అదే శైలిని కొనసాగించింది. రైలు కోచ్‌ లోని బెర్త్, ప్రయాణికులతో ముచ్చట్లు, ప్రయాణ సమయంలో ఎదురయ్యే చిన్న చిన్న విషయాలను ఫన్నీగా చూపించింది. దీంతో వీడియో చూస్తున్న వారికి కూడా తాము రైలులోనే ఆమెతో కలిసి ప్రయాణిస్తున్నట్లుగా అనిపించింది.

అభిమానులతో ఫొటోలు

ప్రయాణ సమయంలో ఆదాను గుర్తుపట్టిన కొందరు అభిమానులు ఆమెతో ఫొటోలు దిగారు. వారితో కూడా ఆమె ఎంతో ఫ్రెండ్లీగా కనిపించింది. స్టార్ హోదా ఉన్నప్పటికీ అందరితో ఇట్టే కలిసిపోవడం చూసే వారికి ఆశ్చర్యం కలిగించింది. ఇదే విషయాన్ని పలువురు నెటిజన్లు కూడా కామెంట్లలో ప్రస్తావించారు. సింపుల్ గా రైలు ప్రయాణం చేయడంతో పాటు అభిమానులతో సరదాగా గడిపిన విధానం చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు.

ఆదా శర్మ సినిమాల గురించి..

ఆదా శర్మ ఇప్పటివరకు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘ది కేరళ స్టోరీ’తో ఆమెకు దేశ వ్యాప్తంగా మరింత గుర్తింపు వచ్చింది. ‘కమాండో’ సిరీస్‌లో యాక్షన్ పాత్రలు చేయడంతో పాటు, ‘సన్‌ఫ్లవర్’, ‘రీటా సన్యాల్’ లాంటి ప్రాజెక్టుల్లో భిన్న పాత్రలను కూడా పోషించింది. ఆమె కెరీర్ ప్రారంభంలో వచ్చిన ‘1920’ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ‘బస్తర్’ లాంటి చిత్రాల్లో కూడా ఆదా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంది.

ఇంతకీ రైలు ఎందుకు ఎక్కిందంటే?

ఆదా శర్మ రైలు ప్రయాణానికి సంబంధించి మరో ఆసక్తికరమైన కారణం వెలుగులోకి వచ్చింది. తన నెక్ట్స్ పాత్ర కోసం పరిశోధనలో భాగంగానే ఈ ప్రయాణం చేసినట్లు ఆమె వెల్లడించింది. అయితే, ఆ సినిమా గురించి ఆదా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live