Nagachaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న నటుడు నాగచైతన్య (Nagachaitanya) ప్రస్తుతం ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం చైతన్య పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ప్రస్తుతం నాగచైతన్య శోభితను రెండో వివాహం చేసుకొని వారి వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.నాగచైతన్య ముందుగా నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 7 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన మూడు సంవత్సరాలకి విడాకులు తీసుకొని విడిపోయారు.
సమంతతో నాగచైతన్య విడాకులు..
సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడంతో వీరి విడాకులకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఈ విషయం నుంచి బయటపడిన నాగచైతన్య తన జీవితంలో మరో అడుగు ముందుకు వేస్తూ మరొక నటి శోభిత(Sobhita)ను ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతోమంది శోభితపై ఎన్నో కామెంట్లు చేశారు. శోభిత కారణంగానే సమంత నాగచైతన్య మధ్య గొడవలు వచ్చాయని వారి విడిపోయారు అంటూ శోభిత గురించి నెగిటివ్ కామెంట్లు చేశారు..
శోభిత గురించి నెగిటివ్ గా మాట్లాడారు..
ఇలా శోభిత గురించి ఎన్నో కామెంట్లు వచ్చినప్పటికీ శోభిత మాత్రం ఎక్కడా ఈ విషయంపై స్పందించలేదు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నా విడాకులు విషయంలో శోభిత ప్రమేయం ఉందని తన కారణంగానే ఇవన్నీ జరిగాయి అంటూ సోషల్ మీడియాలో చాలా నెగెటివిటీని స్ప్రెడ్ చేశారు. వీటన్నింటిని చూస్తే చాలా బాధేస్తుందని అయితే శోభితకు ఈ విషయంలో ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు.
శోభిత ఓపికగా భరించింది…
శోభిత ఇంస్టాగ్రామ్ ద్వారా నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అలా ప్రేమగా మరి పెళ్లి వరకు కారణమైంది అంతకుముందు తనతో నేనెప్పడూ కలిసిన సందర్భాలు లేవని నాగచైతన్య తెలిపారు. ఏదో ఇంస్టాగ్రామ్ లో నాచురల్ గా కలిసామని ఈయన తెలిపారు. తన ప్రమేయం లేకపోయినప్పటికీ తన గురించి ఇలా ఎన్నో విమర్శలు వచ్చినా శోభిత మాత్రం చాలా ఓపికగా వాటిని భరిస్తుంది. ఆ విషయంలో శోభిత చాలా గ్రేట్ అంటూ ఈ సందర్భంగా నాగచైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక నాగ చైతన్య శోభిత పెళ్లి చేసుకున్న ఏడాదికి సమంత కూడా దర్శకుడు రాజ్ ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య సమంత విడాకులు తీసుకుని విడిపోయి తిరిగి వారిద్దరూ వారి జీవితంలో మరో అడుగు ముందుకు వేస్తూ ఇద్దరు కూడా ప్రస్తుతం వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం నాగ చైతన్య, సమంత ఇద్దరు కూడా వారి కెరియర్ పరంగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

