Vrushakarma: అక్కినేని నాగచైతన్య ఇటీవల కాలంలో విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గత ఎడాది తండేల్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న నాగచైతన్య ఈసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
నాగచైతన్య ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు(Karthik Varma Dandu) దర్శకత్వంలో వృషకర్మ(Vrusha Karma) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్నారు. ఇక ఇటీవల నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
90% షూటింగ్ పూర్తి చేసుకున్న వృషకర్మ..
ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుందని, కేవలం 10 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. ఈ సినిమాని ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో కచ్చితంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఈయన తెలియజేశారు. ఈ సినిమా విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెల్లడి కాబోతుందని నాగచైతన్య ఈ సందర్భంగా తెలియజేశారు.
సోసియో ఫాంటసీ సినిమాగా వృష కర్మ..
ఇక నాగచైతన్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా వృష కర్మ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. సోసియో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్స్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.గ్రామీణ నేపథ్యంలో జరిగే క్షుద్ర శక్తులు, నిధి అన్వేషణ, అతీంద్రియ శక్తుల చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుందని తెలుస్తుంది. ఇందులో నాగచైతన్య అర్జున్ అనే పాత్రలో కనిపించబోతున్నారు.
దక్షపాత్రలో మీనాక్షి చౌదరి..
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary)నటించబోతున్న సంగతి తెలిసిందే .ఇందులో ఈమె దక్ష అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇదివరకే ఈమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి పురావస్తు శాఖ అధికారిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఒక అడ్వెంచర్ల థ్రిల్లర్ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో నాగచైతన్య ఇంటెన్స్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పట్ల భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. అక్కినేని అభిమానులు మాత్రం ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

