Dailyhunt
సెప్టెంబర్‌లో పెళ్లి పీటలెక్కనున్న జాన్వీ? వెడ్డింగ్‌పై క్లారిటీ వచ్చేసింది!

సెప్టెంబర్‌లో పెళ్లి పీటలెక్కనున్న జాన్వీ? వెడ్డింగ్‌పై క్లారిటీ వచ్చేసింది!

Big TV Live 1 week ago

Janhvi Wedding: సినీ ఇండస్ట్రీలో గత కొంత కాలంగా పెళ్లి బాజాల సౌండ్ కాస్త గట్టిగానే వినిపిస్తుంది.ఇక ఇదే క్రమంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది.

తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాను ఈ ఏడాది చివర్లో పెళ్లాడబోతోందని, సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ముహూర్తం కూడా కుదిరిందని జోరుగా వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

ఎట్టకేలకి జాన్వీ పెళ్లిపై క్లారిటీ

ఇక ఈ రూమర్స్ ఇలాగే కంటిన్యూ అయితే పెళ్ళికి ముహూర్తాలు పెట్టేస్తారు అనుకున్నాడో ఏమో..ఎట్టకేలకి జాన్వీ పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు ఆమె తండ్రి, స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ .తన కూతురి పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లేనని కుండబద్దలు కొట్టేశాడు. అసలు ఈ ఏడాది జాన్వీ పెళ్లి అనే ముచ్చటే లేదని, వస్తున్న వార్తలన్ని రూమర్స్ అని తేల్చి చెప్పేయడంతో జాన్వీ పెళ్లికి బ్రేక్ పడింది.

ప్రేమాయణం విషయానికి వస్తే

జాన్వీ కపూర్, శిఖర్ పహారియా ప్రేమాయణం విషయానికి వస్తే జాన్వీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వకముందు నుంచే శిఖర్ పహారియాతో ఆమెకు పరిచయం ఉండటం విశేషం.మరింతకీ ఈ శిఖర్ ఎవరో తెలుసా..మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. వీరిద్దరూ టీనేజ్‌లోనే ప్రేమలో పడ్డారు. అయితే, 2016లో వీరిద్దరూ విడిపోయినా దాదాపు ఐదేళ్ల తర్వాత 2022లో వీరిద్దరూ మళ్లీ కలిశారని తెలుస్తుంది.ఇక అప్పటి నుండి వెకేషన్లు, ఫ్యామిలీ ఫంక్షన్లు, ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనాల్లో పదేపదే జంటగా కనిపించడం మనం చూస్తున్నాం కూడా.

ALSO READ :వాళ్లు చేయలేనిది.. విజయ్ చేసి చూపించాడు

రిలేషన్‌షిప్‌పై ఇన్ డైరెక్ట్ హింట్

ఇక గతంలో పాపులర్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో పాల్గొన్న జాన్వీ తన రిలేషన్‌షిప్‌పై ఇన్ డైరెక్ట్ గా హింట్ కూడా ఇచ్చేసింది.”అతనితో ఉంటే నాకు చాలా సేఫ్ ఫీలింగ్ కలుగుతుంది. అతని దగ్గర నేను ఒక చిన్నపిల్లలా ఉండగలను. శిఖర్‌తో గడిపినంత సరదాగా నేను మరెవరితోనూ ఉండలేను” అంటూ తన శిఖర్ పహారియా పట్ల తనకున్న ప్రేమని బయటపెట్టేసింది.దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కుతారని అనుకున్నారంతా.అయితే తాజాగా బోనీ అసలు విషయం చెప్పేయడంతో జాన్వీ పెళ్లి విషయంలో క్లారిటీ వచేసింది.మరింతకీ బాయ్ ఫ్రెండ్ శిఖర్ తోనే పెళ్లి పీటలెక్కుతుందా లేక మరో ప్రియుడిని వెతుక్కుంటుందా చూడాలి.

పెద్ది’ కోసం సిద్ధమవుతున్న ముద్దుగుమ్మ

ఇక జాన్వీ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ పెద్దిలో అచ్చియమ్మ గా కనిపిస్తున్న సంగతి తెల్సిందే.ఇక ఇప్పటికే రెండుసార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా, ఎట్టకేలకు జూన్ 4వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. చూడాలి మరి ఈ సినిమా తర్వాత జాన్వీ టాలీవుడ్ లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో !

ALSO READ :బాక్సాఫీస్ దగ్గర 'పెద్ది'కి థియేటర్ల షాక్? ఎగ్జిబిటర్ల అల్టిమేటం.. టాలీవుడ్ కి పెద్ద గండమే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live