Veerabhadrudu Review :కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నుంచి ఒక పక్కా మాస్ సినిమా వచ్చి చాలా కాలమైంది. అభిమానులు ఏ రేంజ్ కమర్షియల్ హంగామాను ఆశిస్తున్నారో, సరిగ్గా అలాంటి 'రా అండ్ రస్టిక్' ఎంటర్టైనర్ అంటూ 'వీరభద్రుడు' (తమిళంలో కరుపు)తో ఈరోజే థియేటర్లలోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు సూర్య.
మరి ఎప్పటి నుండో మాంచి హిట్ పడాలని కోరుకున్న సూర్యకి ‘వీరభద్రుడు’ఆ హిట్ ని అందించిందా ? చూసేద్దాం !
కథ
సినిమా కథ విషయానికి వస్తే.. ఇది ఒక ఊరి కోర్టు బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. అక్కడ బేబీ కన్నన్ అనే ఒక అవినీతి లాయర్ తన అరాచకాలతో అమాయకులను పీడిస్తుంటాడు. . “దేవుడు దిగి వచ్చినా నన్నేం చేయలేడు” అని విర్రవీగే ఆ విలన్‌కు బుద్ధి చెప్పడానికి, ఆ ఊరి దేవుడు ‘కరుపుస్వామి’ మనిషి రూపంలోకి వస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ
చానాళ్ల తర్వాత సూర్య తన అసలైన మాస్ పవర్ చూపించారు. ముఖ్యంగా కళ్లలో ఆ ఇంటెన్సిటీ, నడకలో ఆ గంభీర్యం చూస్తుంటే పాత సూర్యను చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ లో ‘గాడ్ మోడ్’ ఆన్ అయినప్పుడు వచ్చే ఎలివేషన్లు థియేటర్లలో విజిళ్లు వేయిస్తున్నాయి. గతంలో ‘సింగం’ సిరీస్ లో సూర్య చూపించిన వేగం, ఇందులో దైవికమైన ఆవేశంతో తోడై గూస్ బంప్స్ తెప్పిస్తోంది.ముఖ్యంగా శరవణన్ అనే లాయర్ అవతారంలో సూర్య ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోతుంది.ఇక ఆర్జే బాలాజీ ఈ సినిమాలో పెద్ద సర్ప్రైజ్. కామెడీని వదిలేసి క్రూరమైన విలన్ గా మారిపోయి ప్రేక్షకులను భయపెట్టాడు.ఈ పాత్రలో ఆర్జే బాలాజీ కనిపించిన తీరు అద్భుతం
ఇక మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసిందనే చెప్పాలి. ‘రుద్రతాండవం’ అనే పదానికి నిలువెత్తు రూపంలా ఆయన సంగీతం ఉందంటే ఆశ్చర్యం లేదు.యాక్షన్ సీక్వెన్స్‌లలో అయితే ఆ BGM వింటుంటే సీట్లలో కూర్చోవడం కష్టమే. అలాగే చాలా కాలం తర్వాత సూర్య-త్రిష కాంబోను వెండితెరపై చూడటం ఫ్యాన్స్‌కు ఒక ఐ ఫీస్ట్ లాంటిది. లాయర్ పాత్రలో త్రిష ఎంతో హుందాగా నటించి మెప్పించింది.
also read :KD మూవీ రివ్యూ.. సౌండ్ ఎక్కువ.. సరుకు తక్కువ!
ప్లస్ పాయింట్స్
- సూర్య విశ్వరూపం
- ఆర్జే బాలాజీ విలనిజం
- సూర్య-త్రిష కాంబో
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
- సెకండాఫ్ లో సాగదీత
- పాత కమర్షియల్ ఫార్ములా
చివరిగా
సినిమాలో అక్కడక్కడా పాత కమర్షియల్ ఫార్ములా కనిపించినా, సెకండాఫ్ లో కొన్ని సీన్లు సాగదీసినట్టు అనిపించినా సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ ఆ లోటును పూర్తిగా భర్తీ చేసేసింది. లాజిక్కులు వెతక్కుండా థియేటర్ కి వెళ్లే ప్రేక్షకులకు ఇదొక ఊర మాస్ జాతర. సూర్య తన అడ్డాలోకి మళ్ళీ పవర్ ఫుల్ గా రీ-ఎంట్రీ ఇచ్చారు. ‘కంగువ’,రెట్రో వంటి భారీ ప్రాజెక్టుల తర్వాత ఇలాంటి పక్కా లోకల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా రావడం సూర్య కెరీర్‌కు ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. ఆడియన్స్ కి సరిగ్గా కనెక్ట్ అయితే మాత్రం ఈ ‘డివైన్ మాస్’ మూవీ కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం ఖాయం. ఇక సినిమా చూడాలనుకునే వారు మాత్రం థియేటర్లలో ఆ పూనకాలను ఎంజాయ్ చేయాల్సిందే!
VEERABADRUDU(KARUPPU) review and rating 2.25/5
also read: దళపతి విజయ్ నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ పీఠమేనా? వైరల్ అవుతున్న జ్యోతిష్యుడి జోస్యం

