EAPCET Results: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలతోపాటు అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఈఏపీసెట్ ఫలితాలు రిలీజయ్యాయి.
హైదరాబాద్ జేఎన్టీయూ కళాశాలలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు విడుదల చేశారు. ఇంజినీరింగ్ లో 73.36 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించగా.. అగ్రికల్చర్, ఫార్మసీలో 86.27 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను వారం రోజుల్లో ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈఏపీసెట్ పరీక్షల్లో భాగంగా ఈనెల 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, పార్మసీ పరీక్షలను నిర్వహించగా, ఈ నెల 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహించారు. పరీక్షలను నిర్వహించిన కేవలం ఐదు రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు.
125 కేంద్రాల్లో..
ఇంజినీరింగ్ విభాగంలో 2,10,766 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 1,97,241 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 1,44,704 మంది అర్హత సాధించారు. 125 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 90,977 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 84,954 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే అందులో 73,294 మంది అర్హత సాధించారు. 106 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. ఇదిలాఉండగా ఇంజినీరింగ్ విభాగంలో టాప్-10 మంది ర్యాంకర్ల వివరాలను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేయగా, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో టాప్-10 ర్యాంకర్ల వివరాలను కళాశాల విద్య కమిషనర్ శ్రీదేవసేన విడుదల చేశారు.
బాలికలు..
ఇంజనీరింగ్ లో బాలిక ఎం రుషి 156.63 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించగా.. అగ్రికల్చర్, ఫార్మసీలో ఎం అహ్మద్ 150.17 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించాడు. ఇంజనీరింగ్ విభాగంలో 90,670 మంది బాలికలు దరఖాస్తు చేసుకోగా, వారిలో 84,495 మంది పరీక్షలకు హాజరయ్యారు. అందులో 62,291 మంది(73.72శాతం) అర్హత సాధించారు, 1,20,096 మంది బాలురు దరఖాస్తు చేసుకుంటే వారిలో 1,12,747 మంది పరీక్షలు రాయగా.. అందులో 82,413 మంది(73.10శాతం) అర్హత సాధించారు, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు 69.349 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 64,913 మంది పరీక్షలకు హాజరయ్యారు.
గద్వాల్లో జోరుగా క్రికేట్ బెట్టింగ్ దందా.. 100 నుండి లక్ష వరకు పందెం కాస్తున్న రాయుళ్లు!
ఒకరు ట్రాన్స్ జెండర్..
అందులో 56,320 మంది(86.76 శాతం) అర్హత సాధించారు. బాలురు 21,627 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 20,040 మంది పరీక్షలకు హాజరవ్వగా అందులో 16,973 మంది(84.70శాతం) అర్హత సాధించారు. ఒకరు ట్రాన్స్ జెండర్ పరీక్షకు హాజరుకాగా అర్హత సాధించింది. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, ఈఏపీసెట్ కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, ఈఏపీసెట్ కో కన్వీనర్ ప్రొఫెసర్ బాలు నాయక్ పాల్గొన్నారు.
ఈఏపీసెట్ ఫలితాల్లో సత్తాచాటిన సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్..
ఈఏపీసెట్ ఫలితాల్లో సాంఘీక సంక్షేమ గురుకుల విద్యార్థులు తమ సత్తా చాటారు. గురుకులాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో గురుకుల విద్యార్థులు సాధించిన అత్యుత్తమ ఫలితాలపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తంచేశారు. ఈ విజయం విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, సంస్థ నిరంతర సహకారానికి ప్రతిఫలమన్నారు. గురుకుల విద్యార్థులకు నిరంతరం ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండగా నిలవడం వల్లనే ప్రతి ఫలితాల్లో మంచి ర్యాంకులు వస్తున్నాయని తెలిపారు.
సెక్రెటరీ కే శారద హర్షం..
విద్యా సంవత్సరమంతా విద్యార్థులకు మార్గ దర్శకంగా ప్రోత్సాహం అందించిన అధికారులను, అధ్యాపకులను అభినందించారు. ఇదిలాఉండగా ఈఏపీసెట్ ఫలితాలపై గురుకుల సెక్రెటరీ కే శారద హర్షం వ్యక్తంచేశారు. ఈ ఏడాది విడుదలైన ఎస్ఎస్సీ, ఇంటర్, జేఈఈ, ఫలితాల్లో కూడా గురుకుల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచారని గుర్తుచేశారు. ప్రత్యేకంగా బోటనీ, జూవాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగ ఉపాధ్యాయుల కృషి ప్రశంసనీయమని ఆమె తెలిపారు. ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఇక ఈ ఫలితాలు గురుకుల సంస్థలో ఉన్న బలమైన టీమ్‌వర్క్, విద్యా ప్రమాణాలకు నిదర్శనమని శారద వెల్లడించారు.
టెన్త్ టాపర్లకు బహుమతులు అందించిన కలెక్టర్ హైమావతి!
ఇంజినీరింగ్ విభాగంలో టాప్10 ర్యాంకర్లు వీరే..
1. ఎం.రుషి(156.63 మార్కులు, ఉప్పల్)
2. అన్షుల్ (148.70, మూసాపేట్)
3. ఎం వంశీధర్ రెడ్డి(148.70, పులివెందుల)
4.జే రోషన్ మణిదీప్(144,44, గుంటూరు)
5.ఏ సాయి నిఖిత్(143.30, మహబూబ్ నగర్)
6. ఎం ఆస్నా(143.28, మేడ్చల్)
7. వీ శరద్ మహీశ్వరి(142.92, బంజారాహిల్స్)
8. టీ శ్రేయాష్ రెడ్డి(140.24, కొండాపూర్)
9. బొమ్మిరెడ్డి సమీరాజ్ రెడ్డి(139.85, ఎల్బీనగర్)
10. రాపోలు జయంత్ శేఖర్ రెడ్డి(139.78, సుచిత్ర)
అగ్రికల్చర్ విభాగంలో టాప్ 10 ర్యాంకర్లు వీళ్లే..
1. ముఖరాం అహ్మద్(150.17, ఆసిఫ్ నగర్)
2. తాడూరి నివృత్ సాయి వెంకట్(143.43, ఎర్రమంజిల్-హైదరాబాద్)
3. సాహితి గీతిక గునితి(142.35, అల్మాస్‌గూడ)
4. మయూక్ జయసింహ(139.78, బాగ్‌అంబర్‌పేట-హైదరాబాద్)
5.అమైర్ అనాస్(137.40, హుమాయన్ నగర్)
6. నాథన్ షెబా జెరుషా(137.24, హిందూపురం)
7. పెరికెటి అనురాగ్(136.67, రాజమహేంద్రవరం)
8. బూర సాయి శరణ్(135.21, సూర్యాపేట)
9. ఎం మారుతి సత్యశ్రీకర్(134.97, రాజమహేంద్రవరం)
10. రుతుంబిక మోహంటి(134.57, కూకట్‌పల్లి)
Also read: బండి సంజయ్ టార్గెట్‌గా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు.. కేంద్రమంత్రి పదవి ఊడాల్సిందే!

