Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ విజయం.. విజిలేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న హీరో జీవా!

విజయ్ విజయం.. విజిలేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న హీరో జీవా!

Big TV Live 3 weeks ago

Actor Jiiva: నేడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తమిళ రాజకీయాలతో పాటు, హాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగిన నటుడు విజయ్(Vijay) టీవీకే పార్టీ(TVK party)ని స్థాపించి రెండు సంవత్సరాలకే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశారు. ఈ విధంగా ఏప్రిల్ 24వ తేదీ తమిళనాడులో ఎన్నికలు జరిగాయి ఇక నేడు ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. విజయ్ పోటీ చేసిన రెండు స్థానాలలో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అలాగే ఈయన 110 స్థానాలకు పైగా విజయం సాధించడంతో ప్రభుత్వాన్ని టీవీకే పార్టీ ఏర్పాటు చేయబోతోంది.

హీరో విజయ్ కు అభినందనలు వెల్లువ..

ఇలా పార్టీ స్థాపించిన రెండు సంవత్సరాలకే ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి గొప్ప మహానుభావులు ఈ విధమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆ తరహాలోనే నటుడు విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లకే ముఖ్యమంత్రి హోదాలో ఉండబోతున్నారు. ఇక ఈయన రాజకీయాలలోకి రావడంతో ఎంతోమంది సినీ ప్రముఖుల నుంచి కూడా విజయ్ కు పూర్తిస్థాయిలో మద్దతు లభించింది. విజయ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖుల నుంచి కోలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు మొత్తం హీరో విజయ్ కు అభినందనలు తెలియజేస్తున్నారు.

హీరో జీవా ఎమోషనల్..

ఈ క్రమంలోనే నటుడు జీవా సైతం సోషల్ మీడియా వేదికగా హీరో విజయ్ విజయాన్ని పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకున్నారు. విజయ్ ముందంజలో ఉన్న నేపథ్యంలో ఆయన విజయం ఖరారు అయింది ఈ నేపథ్యంలోనే జీవా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మేడ పైకి వెళ్లి గట్టిగా విజిల్స్ వేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు .అనంతరం విజయ్ మంచి మెజారిటీని సొంతం చేసుకోవడంతో కాస్త ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ ఎన్నికలలో మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.

సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకున్న విజయ్ అనూహ్యంగా రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఇలా రాజకీయ పార్టీని స్థాపిస్తూ తన పార్టీ పేరును ప్రకటించారు. రెండేళ్ల సమయంలో ఈయన పూర్తి స్థాయిలో రాజకీయాల వైపు దృష్టి సారించి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. పార్టీ పెట్టిన రెండు సంవత్సరాలకే ఇతర పార్టీలతో పొత్తు లేకుండా, సింగిల్ గా ఎన్నికల బరిలోకి దిగి అద్భుతమైన మెజారిటీని సొంతం చేసుకున్నారు. విజయ్ విజయాన్ని చూసి రాజకీయ విశ్లేషకులు సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ ఎన్నికలలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉన్నారు.

విజయ్ కీలక నిర్ణయం. డిప్యూటీ సీఎంగా త్రిషకు పట్టాభిషేకం?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live