Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డార్క్ స్కిన్ మాయం.. టమాటోతో మీ చర్మం మరింత కాంతివంతం!

డార్క్ స్కిన్ మాయం.. టమాటోతో మీ చర్మం మరింత కాంతివంతం!

CHAI PaKODi 3 weeks ago

మాటో కేవలం వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా, మన చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. టమాటోలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, లైకోపీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉన్న నలుపును (Sun Tan), మచ్చలను తగ్గించి సహజమైన నిగారింపును ఇస్తాయి.

డార్క్ స్కిన్, పిగ్మెంటేషన్ సమస్యలతో బాధపడేవారికి టమాటో గుజ్జు ఒక అద్భుతమైన న్యాచురల్ రెమెడీ. ఇది చర్మం లోపలి పొరల్లోకి వెళ్లి మురికిని శుభ్రం చేస్తుంది.

వేసవికాలంలో ఎండతాపం ఎక్కువగా వున్న నేపథ్యంలో ఎన్నోరకాల చర్మసమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చర్మసౌందర్యానికి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

చర్మం నల్లబడటం, కంటికింద నల్లటి వలయాలు, సన్-టాన్, డార్క్ స్కిన్, చర్మం పొడిబారిపోవడం.. ఇలా రకరకాల సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యల నుంచి ఉపశహనం పొందాలంటే అందుకు కొన్ని ఇంటి చిట్కాలు (హోమ్ రెమెడీస్) వున్నాయి.

రాత్రి పడుకునే ముందు టమోటోను మధ్యకు కట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత రోజు ఉదయం చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. చర్మం కాంతివంతంగా మారుతుంది.

నల్లగా వుండే మచ్చలు కాలక్రమంలో తగ్గుతూ ఒకానొక దశలో పూర్తిగా తొలిగిపోతాయి. నల్లని చర్మం సౌందర్యంవంతంగా మారుతుంది.

Also Read:సూపర్ నట్ "పీకాన్": చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి, ఇమ్యూనిటీని పెంచే అద్భుత ఔషధం!

ఒక పాత్రలో టమోటో జ్యూస్‌ను తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం, బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. 10 నిముషాలవరకు అలాగే వుంచుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే డార్క్ స్కిన్ నుంచి ఉపశమనం పొంది.. చర్మం ప్రకాశివంతంగా మారుతుంది.

టమోటోను రెండుగా కట్ చేసి, గుజ్జును ముఖానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. ఆయిలీ స్కిన్‌కు చెక్ పెట్టవచ్చు.

Also Read:రోజూ ఉదయాన్నే ఇది తాగితే 7 రోజుల్లో ఎంతటి భారీ పొట్ట అయినా ఫ్లాట్ అవ్వాల్సిందే!

మంచి ఫలితాల కోసం ఈ ప్యాక్స్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు వేసుకోవచ్చు. అయితే, సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు నిమ్మరసం వాడే ముందు చేతిపై ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi