Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఖరీదైన క్రీమ్స్ ఎందుకు? పెరుగుతో మీ ముఖాన్ని ఇలా కాంతివంతంగా మార్చుకోండి!

ఖరీదైన క్రీమ్స్ ఎందుకు? పెరుగుతో మీ ముఖాన్ని ఇలా కాంతివంతంగా మార్చుకోండి!

CHAI PaKODi 3 weeks ago

Curd Face glow Tips In Telugu : మనం ముఖం మెరిసిపోవాలని మార్కెట్లో దొరికే ఎన్నో రకాల క్రీమ్స్, ఫేస్ వాష్‌లు తెగ వాడుతుంటాం కదా? కానీ అవేవీ శాశ్వత ఫలితాలను ఇవ్వవు సరికదా, ఒక్కోసారి ఆ కెమికల్స్ వల్ల స్కిన్ పాడయ్యే ప్రమాదం కూడా ఉంది.

మరి ఏ ఖర్చూ లేకుండా, మన ఇంట్లో రోజూ ఉండే ‘పెరుగు’తో మన ముఖాన్ని ఎంత అద్భుతంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చో మీకు తెలుసా? చర్మ సౌందర్యం విషయంలో పెరుగు చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ముఖంపై మచ్చలు తగ్గించి, గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవడానికి పెరుగును ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం రండి!

ప్రతి రోజు మనం ఉపయోగించే ఆహారాలలో పెరుగు ఒకటి. పెరుగును రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. పెరుగులో సమృద్ధిగా ఉండే ప్రోటీన్స్ మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

పెరుగులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు మనకు తెలుసు. పెరుగు సౌందర్య పోషణలో కూడా బాగా హెల్ప్ అవుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చటంలో పెరుగు బాగా సహాయపడుతుంది.

పెరుగులో ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు ఉండుట వలన చర్మాన్ని పొడిగా మరియు నిస్తేజంగా కాకుండా తేలికగా మరియు మృదువుగా ఉండేలా చేస్తుంది. చర్మంపై గీతలు, ముడతలు, రంద్రాలని తొలగించటంలో సహాయపడుతుంది.

పెరుగులో ఉండే రిబోఫ్లేవిన్ చర్మాన్ని ప్రకాశవంతంగా ,హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. కణాల పెరుగుదల మరియు పునరుత్పత్తికి సహాయపడుతుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ పెరుగు, అరస్పూన్ తేనే,అరస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా రాసి అరగంట అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి రెండు, మూడు సార్లు చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోవటంతో పాటు ముఖం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై మృత కణాలు కూడా తొలగిపోతాయి.

Face Glow Tips: ముఖంపై మురికి, నలుపు మాయం.. పంచదారతో ఈ చిన్న మ్యాజిక్ ట్రై చేయండి!

చిన్న గిన్నెలో టేబుల్ స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ శెనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ మాదిరిగా అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.

ఈ ప్యాక్ వారానికోసారి వేసుకోవడం వల్ల చర్మం సున్నితంగా తయారవడంతో పాటు మొటిమలు, వాటి వల్ల ఏర్పడిన మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి.

టేబుల్ స్పూన్ పెరుగులో పావు టేబుల్ స్పూన్ పసుపు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.

ఖరీదైన పార్లర్ ట్రీట్‌మెంట్స్ వద్దు.. ఈ న్యాచురల్ మాస్క్‌తో సిల్కీ హెయిర్ మీ సొంతం.

పసుపులో ఉన్న యాంటీసెప్టిక్ గుణాలు మొటిమలు రాకుండా కాపాడటంతో పాటు.. పసుపు మేనిఛాయను సైతం పెంచుతాయి. వారానికోసారి ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi