Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొబ్బరి నూనెలో ఇది కలిపి రాస్తే చాలు.. మీ ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోతుంది!

కొబ్బరి నూనెలో ఇది కలిపి రాస్తే చాలు.. మీ ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోతుంది!

CHAI PaKODi 1 week ago

Coconut Oil Face Glow tips:పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టినా ముఖంపై గ్లో కేవలం రెండు రోజులే ఉంటోందా? ఎండ వల్ల లేదా కాలుష్యం వల్ల చర్మం కాంతివిహీనంగా, నిర్జీవంగా తయారైందని బాధపడుతున్నారా?

అయితే మీ ఇంట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే కొబ్బరి నూనెతో ఒక అద్భుతమైన మ్యాజిక్ చేయొచ్చు.

స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో ఒక చిన్న వస్తువు కలిపి ముఖానికి రాస్తే చాలు, మీ చర్మం మృదువుగా, కాంతివంతంగా మెరిసిపోతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ న్యాచురల్ చిట్కాను ఎలా తయారు చేయాలో, ముఖానికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం రండి!

ఏదైనా చర్మ సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా సమస్యల నుండి బయట పడవచ్చు.

ఈ మధ్య కాలంలో ఎండ వలన, పొల్యూషన్ వల్ల చర్మం నల్లగా మారుతూ ఉంటుంది. నల్లగా మారిన చర్మం తెల్లగా మారాలంటే మనలో చాలామంది మార్కెట్లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు దాని కోసం వేలకొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

అలా కాకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతో సులభంగా నల్లని ముఖాన్ని తెల్లగా మార్చుకోవచ్చు. దీని కోసం ఒక బౌల్లో రెండు స్పూన్ల మైల్డ్ బాడీ షవర్, మూడు స్పూన్ల పంచదార, అర స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి.

పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మృత చర్మ కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. చర్మానికి తగినంత తేమ అందుతుంది.

వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది. రాత్రి పడుకొనే ముందు చేస్తే సరిపోతుంది. రాత్రి సమయంలో కుదరని వారు ఉదయం సమయంలో చేయవచ్చు.

బార్లీ ఖీర్: ఒక్కసారి ఇలా ట్రై చేయండి, కమ్మటి రుచికి ఫిదా అవ్వాల్సిందే!

ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ మనకు సులువుగానే అందుబాటులో ఉంటాయి. అలాగే పంచదార మంచి స్క్రబ్ గా పనిచేసి చర్మంలో ఉన్న మృత కణాలను తొలగించి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది. అలాగే కొబ్బరి నూనె కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది.

అయితే ఆర్గానిక్ కొబ్బరి నూనె వాడితే మంచిది. ఈ చిట్కాను పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చులో అందమైన తెల్లని ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఈ చిట్కాను చేయటానికి ప్రయత్నం చేసి మంచి పలితాలను పొందండి. అన్ని ఇంగ్రిడియన్స్ సులభంగానే లభ్యం అవుతాయి.

మిగిలిపోయిన అన్నంతో అదిరిపోయే టమాటో పులావ్.. ఇలా చేస్తే ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారు!

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi