Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిమ్మరసంతో చుండ్రుకి శాశ్వత పరిష్కారం.. ఎలా వాడాలో తెలుసా?

నిమ్మరసంతో చుండ్రుకి శాశ్వత పరిష్కారం.. ఎలా వాడాలో తెలుసా?

CHAI PaKODi 3 weeks ago

Dandruff Home Remedies:చుండ్రు (Dandruff) సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారా? ఖరీదైన షాంపూలు, ప్రోడక్ట్స్ వాడి విసిగిపోయారా? అయితే మీ వంటింట్లో ఉండే నిమ్మకాయతో ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు తలలోని డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి, మాడును (Scalp) శుభ్రపరుస్తాయి. దీనివల్ల చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు కుదుళ్లు కూడా దృఢంగా మారతాయి.

అయితే, నిమ్మరసాన్ని నేరుగా జుట్టుకు రాసుకునే బదులు, దాన్ని సరైన పద్ధతిలో ఎలా వాడాలి? కొబ్బరినూనె లేదా పెరుగుతో కలిపి ఎలా అప్లై చేయాలి? చుండ్రును శాశ్వతంగా వదిలించుకోవడానికి పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అనే పూర్తి వివరాలను ఇందులో తెలుసుకుందాం.

చాలా మందికి చుండ్రు సమస్య తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. దీన్ని అరికట్టేందుకు పలు రకాలైన మందులను వాడుతుంటారు. అయినప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం లభించదు. ఇలాంటి ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలను పాటిస్తే చుండ్రు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని పొందవచ్చు.

ప్రతి రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు నాలుగు కప్పుల గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల నిమ్మరసం.

Also Read:Select Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి ప్రేమ, పెళ్లి విషయాల్లో కష్టాలు తప్పవా?

నాలుగు చెంచాల కొబ్బరినూనె కలిపి ఆ మిశ్రమాన్ని తల వెంట్రుకలకు దట్టించి తలకు మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత తలకు గుడ్డ చుట్టాలి. ఈ గుడ్డను రాత్రంతా అలాగే ఉంచాలి.

ఉదయం నిద్ర లేచిన తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక రోజు చొప్పున నెలలో నాలుగుసార్లు చేసినట్టయితే చుండ్రు సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవచ్చు.

గమనిక: మీకు బాగా సెన్సిటివ్ స్కిన్ ఉంటే, నిమ్మరసాన్ని తలకు రాసుకునే ముందు కొద్దిగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

Also Read:కోటీశ్వరులు కావాలా? నెలకు రూ.12,500 పొదుపుతో రూ.కోటి కొట్టే సూపర్ ప్లాన్ ఇదే!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi