Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పార్లర్‌కు వెళ్లే పనిలేదు: పంచదార + శనగపిండితో మీ ముఖం నిగనిగలాడటం ఖాయం!

పార్లర్‌కు వెళ్లే పనిలేదు: పంచదార + శనగపిండితో మీ ముఖం నిగనిగలాడటం ఖాయం!

CHAI PaKODi 3 weeks ago

Besan and sugar Face Glow Tips In telugu :మనలో ప్రతి ఒక్కరూ అందమైన,కాంతివంతమైన ముఖం కావాలని కోరుకుంటారు. అలా కోరుకోవటం కూడా సహజమే. దీని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.

కేవలం మన ఇంటిలో ఉంటే సహజసిద్దమైన పదార్ధాలతో ముఖాన్ని చాలా తక్కువ ఖర్చుతో మిలమిలా మెరిసేలా చేయవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార,ఒక స్పూన్ శనగపిండి,ఒక స్పూన్ రాగి పిండి వేసి దానిలో కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి వృత్తాకార మోషన్ లో మసాజ్ చేయాలి. బాగా ఆరాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే ముఖం మీద పెరుకుపోయిన దుమ్ము,ధూళి తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

Also Readప్రతి ఇల్లాలు మెచ్చే టాప్ 10 అమేజింగ్ కిచెన్ టిప్స్

అలాగే ముఖం మీద ఉన్న బ్లాక్ హెడ్స్,నల్లని మచ్చలు అన్నీ తొలగిపోతాయి. కాస్త సమయాన్ని కాస్త శ్రద్ద పెడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని మిలమిలా మెరిసేలా చేసుకోవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

నేను 15 రోజులుగా ఈ చిట్కాను ఫాలో అవుతున్నాను. నా ముఖం మీద ఉన్న నల్లని మచ్చలు తగ్గటం ప్రారంభం అయింది. అలాగే మరో 15 రోజులు చేస్తే మొత్తం నల్లని మచ్చలు మాయం అవుతాయి. కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా ఈ చిట్కాను ఫాలో అవవ్వచ్చు.

Also Readఅధిక బరువు, షుగర్, బీపీ భయం వదిలేయండి.. రోజూ గుప్పెడు ఇవి తినండి!

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Also Readఈ పండుతో ఇన్ని లాభాలా? ఈ నిజాలు తెలిస్తే ఎప్పటికీ వదిలిపెట్టరు

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi