Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రతి ఇల్లాలు మెచ్చే టాప్ 10 అమేజింగ్ కిచెన్ టిప్స్

ప్రతి ఇల్లాలు మెచ్చే టాప్ 10 అమేజింగ్ కిచెన్ టిప్స్

CHAI PaKODi 3 weeks ago

Telugu Kitchen Hacks:వంటగదిలో గంటల తరబడి కష్టపడుతున్నారా? మీ వంటను మరింత సులభంగా, వేగంగా మరియు రుచిగా మార్చే అద్భుతమైన 'వంటింటి చిట్కాలు' (Kitchen Hacks) మీకోసం!

కూరగాయలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవడం దగ్గరి నుండి, వంటలో సమయం మరియు శ్రమను ఆదా చేసే స్మార్ట్ ట్రిక్స్ వరకు.. ప్రతి గృహిణికి రోజూ ఉపయోగపడే బెస్ట్ కిచెన్ టిప్స్ ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.మీ శ్రమను తగ్గించుకుని, స్మార్ట్‌గా వంట చేయాలనుకుంటే దీన్ని తప్పకుండా చూడండి

ప్రతి ఇల్లాలు తప్పనిసరిగా తెలుసుకోవలసిన వంటింటి చిట్కాలు..వంటింటిలో కొన్ని చిట్కాలను పాటిస్తే పనులు చాలా తొందరగా అవ్వటమే కాకుండా సమయం కూడా చాలా ఆదా అవుతుంది. అలాంటి కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సులభంగా పాటించవచ్చు.

మనం సాధారణంగా ఇడ్లి పిండిని గ్రైండర్ లో రుబ్బుతూ ఉంటాం. గ్రైండర్ లో రుబ్బటం వలన పిండి బాగా పొంగి ఒదుగు వస్తుంది. కానీ గ్రైండర్ లేనివారు మిక్సీలో ఇడ్లి పిండిని రుబ్బుతూ ఉంటారు. అలాంటప్పుడు పిండి కాస్త ఒదుగు తగ్గుతుంది. మిక్సీలో రుబ్బినప్పుడు కూడా ఒదుగు బాగా వచ్చి పొంగాలంటే బాగా చల్లని నీటిని పోసి మిక్సీ చేయాలి.

వానలు వచ్చాయంటే ఈగలు వచ్చేస్తూ ఉంటాయి. మనం వండిన అన్ని వంటకాల మీద వాలుతూ చికాకును తెప్పిస్తాయి. ఈగలను వదిలించుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. అది ఏమిటంటే కొన్ని పుదీనా ఆకులను కట్ చేసి ఈగలు ఉన్న ప్రదేశంలో పెట్టాలి. పుదీనా ఘాటుకి ఈగలు పారిపోతాయి.

మనం ఫ్రిడ్జ్ లో ఎన్నో రకాలను పెడుతూ ఉంటాం. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఒక రకమైన వాసన రావటాన్ని గమనిస్తాం. అయితే ఈ వాసన ఎలా పోతుందో అని కొంతమంది కంగారు పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ చిట్కా పాటించండి. ఒక నిమ్మకాయను కట్ చేసి ఫ్రిడ్జ్ లో మూల పెడితే ఫ్రిడ్జ్ లో ఉన్న చెడు వాసనలను పీల్చుకుంటుంది. దాంతో ఫ్రిడ్జ్ వాసన లేకుండా ఉంటుంది.

చపాతీలను చేసి పిలల్లకు లంచ్ బాక్స్ లో పెడుతూ ఉంటాం. వాటిని పిల్లలు తినేసరికి గట్టిగా ఉండి తినటానికి చాలా కష్టంగా ఉంటుంది. చపాతీలు మెత్తగా మృదువుగా రావాలంటే చపాతీ పిండిని కలిపేటప్పుడు నీటికి బదులుగా గోరువెచ్చని పాలను ఉపయోగిస్తే చపాతీలు మెత్తగా,మృదువుగా వస్తాయి.

పులిహోర,పలావ్,ప్రైడ్ రైస్ వంటివి తయారుచేసినప్పుడు అన్నం ముద్దగా లేకుండా పొడిపొడిగా ఉంటే బాగుంటుంది. అన్నం ఆలా పొడిగా రావాలంటే అన్నం వండేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి లేదా నూనె వేస్తె అన్నం ముద్ద కాకుండా పొడిగా వస్తుంది.

Also Read:15 రోజుల్లో ఒత్తైన, పొడవైన జుట్టు మీ సొంతం: ఈ ఒక్క స్పూన్ నూనెతో!

ఒక్కోసారి బియ్యం ఎక్కువగా కొనేస్తూ ఉంటాం. అలాంటప్పుడు బియ్యం పురుగు పడుతుంది. ఈ సమస్య చాలా మందికి ఉంటుంది. ఈ సమస్యకు సులువైన చిట్కా ఉంది. అది ఏమిటంటే వేపాకులను ఎండబెట్టి పొడి చేసి మూట కట్టి బియ్యంలో వేయాలి. వేపాకులలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉండుట వలన పురుగులు బియ్యంలోకి చేరవు.

కందిపప్పు,మినపప్పు వంటి వాటికీ పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాల కింద కొన్ని వేపాకులను ఉంచితే వేప వాసనకు పురుగులు రావు.

Also Read:ఒక్కసారి ఈ ప్యాక్ వేసుకుంటే చాలు.. తెల్ల జుట్టు నల్లగా మారడం 100% గ్యారెంటీ!

మనం కొన్ని వంటలు లేదా స్వీట్స్ చేసినప్పుడు ఫుడ్ కలర్స్ వాడుతూ ఉంటాం. ఫుడ్ కలర్స్ ని వాడకుండా బీట్ రూట్ ని వాడవచ్చు. ఎలా అంటే బీట్ రూట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా ఎండబెట్టి పొడి చేసి ఉంచుకోవాలి. ఫుడ్ కలర్ వాడవలసి వచ్చినప్పుడు ఈ బీట్ రూట్ పొడిని వాడితే సరిపోతుంది. బీట్ రూట్ పొడి వాడటం వలన మనము చేసే వంటకు రంగు మరియు ఆరోగ్యపరంగా కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.

Also Read:సాయంత్రం స్నాక్ కోసం పర్ఫెక్ట్ పెసర గారెలు

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi