Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

పార్లర్‌తో పనిలేదు.. ఈ 2 నిమిషాల రెమెడీతో మీ ముఖం కాంతివంతంగా మెరుస్తుంది!

CHAI PaKODi 2 days ago

Lemon And Honey Glowing Skin In Telugu : కాలుష్యం, ఎండల వల్ల ముఖం కాంతివిహీనంగా మారి, నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయా? బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పనిలేదు!

మీ ఇంట్లోనే ఉండే సహజమైన పదార్థాలతో కేవలం 2 నిమిషాల్లో మీ చర్మాన్ని నిగనిగలాడేలా, మచ్చలు లేకుండా ఎలా మార్చుకోవాలో ఈ ఆర్టికల్‌లో చదివి తెలుసుకోండి. గ్లోయింగ్ స్కిన్ ఇక మీ సొంతం!

ప్రతి ఒక్కరు ముఖం అందంగా,కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం ఎంత ఖర్చు పెట్టటానికి అయినా రెడీ అవుతారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకొనే చిట్కాతో తక్కువ ఖర్చుతో ముఖాన్ని అందంగా కాంతి వంతంగా మార్చుకోవచ్చు. చర్మం మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళి,మలినాల కారణంగా చర్మం నిర్జీవంగా కనపడుతుంది.

ఇప్పుడు చెప్పే చిట్కా దుమ్ము,ధూళి,నలుపును సమర్ధవంతంగా తొలగిస్తుంది.ఈ చిట్కాకు అవసరమైన అన్ని వస్తువులు మన ఇంటిలో అందు బాటులో ఉండేవే. ఈ చిట్కాను చాలా సులువుగా చేయవచ్చు. ఈ చిట్కాకు అవసరమైన ఇంగ్రిడియన్స్ ఏమిటో తెలుసుకుందాం.

ఊపిరితిత్తుల్లో కఫం, శ్లేష్మం కరిగిపోవాలంటే ఈ ఒక్క పనిచేస్తే చాలు!

చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి, గుండెను కాపాడే అద్భుతమైన పండ్లు ఇవే!

ఒక బౌల్ లో ఒక స్పూన్ తేనే,ఒక స్పూన్ నిమ్మరసం, ఒక విటమిన్ E Capsule ఆయిల్ వేసి బాగా కలిపి ముఖానికి రాసి 2 నిముషాలు మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా పది రోజుల పాటు చేస్తూ ఉంటె ముఖం కాంతివంతంగా,తెల్లగా మారుతుంది.

ఈ చిట్కాలో ఉపయోగించిన నిమ్మ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ముఖ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు తేనెలో సమృద్ధిగా ఉండుట వలన వృద్దాప్య లక్షణాలు ఆలస్యం అవుతాయి.

ఇక విటమిన్ E చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా,కాంతివంతంగా ఉంచటానికి సహాయపడుతుంది. అలాగే చర్మంపై ఉన్న ముడతలు,ఫైన్ లైన్స్ ని సమర్ధవంతంగా తొలగిస్తుంది. విటమిన్ E Capsule మెడికల్ Shops లో లభ్యం అవుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chaipakodi