Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ రోజు బాలయ్య ఆశీర్వదించినట్లే జరగడంతో.. ఆనందంలో నారా బ్రహ్మణి!

ఆ రోజు బాలయ్య ఆశీర్వదించినట్లే జరగడంతో.. ఆనందంలో నారా బ్రహ్మణి!

Chitrajyothy 1 week ago

టసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) వెండితెరపైనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఆయన ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు.

తాజాగా సోషల్ మీడియాలో బాలయ్య బాబుకు సంబంధించిన ఒక పాత వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ హార్ట్ టచింగ్ వీడియోను నారా లోకేష్ సతీమణి, నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రహ్మణి (Brahmani Nara) తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.

ఆ వీడియోలో ఉన్న విషయానికి వస్తే.. కొన్నేళ్ల క్రితం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఒక చిన్నారిని బాలకృష్ణ పరామర్శించారు. ఆ సమయంలో ఆ బాలుడితో ముచ్చటిస్తూ.. ''నువ్వు భవిష్యత్తులో నాలాగే ఒక పెద్ద యాక్టర్ అవుతావు'' అని ఆశీర్వదించారు. బాలయ్య నోట వచ్చిన ఆ మాటలు అక్షరాలా నిజమయ్యాయి. ఆ అబ్బాయి క్యాన్సర్‌ను జయించడమే కాకుండా.. తన కలల వైపు అడుగులు వేస్తూ.. ఆడిషన్స్‌లో సెలెక్ట్ అయ్యాడు. తన మొదటి సినిమా కోసం కష్టపడి నటుడిగా మారి, చివరకు ఒక ఆడియో ఫంక్షన్ వేదికపై అదే బాలకృష్ణ చేతుల మీదుగా సన్మానం అందుకున్నాడు. 'కొన్ని మాటలు కేవలం జోస్యాలు కావు.. అవి విధి లిఖితమైనవి' అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ వీడియో నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది. ఈ వీడియోని షేర్ చేసిన బాలయ్య బిడ్డ నారా బ్రహ్మణి..

''ఈ అద్భుతమైన వీడియోను ఇప్పుడే చూశాను. ఇది నా ఈ డేని ఎంతో అందంగా మార్చేసింది. ఆ చిన్నారి ఎంతో పట్టుదలగా తన కలలను నిజం చేసుకోవడం చూడటానికి చాలా ఆనందంగా ఉంది. అతని ఆశలు, ఆశయాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. బాలయ్య బాబు పలికిన ఆశీర్వచనం ఒక క్యాన్సర్ సర్వైవర్ జీవితాన్ని ఎలా మార్చిందో, అతను ఎలా నటుడిగా ఎదిగాడో చూపిస్తున్న ఈ వీడియో నందమూరి అభిమానులనే కాకుండా ప్రతి ఒక్కరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష: చిరంజీవి కుమార్తె శ్రీజ

బాక్సాఫీస్‌పై 'పెద్ది' వేట.. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?

నిన్న అల్లు అర్జున్.. నేడు అఖిల్.. చరణ్ యాక్టింగ్‌కు ఫిదా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy