Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అఖిల్ కోసం రంగంలోకి ఎన్టీఆర్? ఇక ఊహించుకోండి!

అఖిల్ కోసం రంగంలోకి ఎన్టీఆర్? ఇక ఊహించుకోండి!

Chitrajyothy 3 weeks ago

క్కినేని యువ హీరో అఖిల్ (Akhil Akkineni), భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తోన్న చిత్రం 'లెనిన్' (Lenin). మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తోన్న ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే మూవీని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు నిర్మాతలు సరికొత్త, వినూత్నమైన ప్రమోషనల్ స్ట్రాటజీలను సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో ఒక క్రేజీ ప్రచారం జోరందుకుంది. అదేమిటంటే.. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) రంగంలోకి దిగబోతున్నారట. ముఖ్యంగా అఖిల్‌ను ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసే ఒక టాక్ షో తరహా ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

టాలీవుడ్‌లో నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. గతంలో కూడా ఎన్టీఆర్, అఖిల్ పలుమార్లు పబ్లిక్ వేదికలపై ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడం, పరస్పరం సినిమాలకు బెస్ట్ విషెస్ చెప్పుకోవడం చూశాం. గతంలో అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు కూడా ఎన్టీఆర్ ఛీప్ గెస్ట్‌గా వచ్చారు. ఇప్పుడు మరోసారి 'లెనిన్' సినిమా కోసం ఈ ఇద్దరు స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే, ఆ హడావుడి వేరే లెవెల్‌లో ఉంటుందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ లాంటి గ్లోబల్ స్టార్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగమైతే, అది కేవలం అక్కినేని అభిమానులనే కాకుండా సాధారణ ప్రేక్షకులను సైతం థియేటర్ల వైపు రప్పించేందుకు ఒక పెద్ద బూస్ట్‌లా మారుతుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక కెరీర్ పరంగా అఖిల్‌కి ఈ 'లెనిన్' చిత్రం ఎంతో కీలకమైనది. గత చిత్రాల ఫలితాల తర్వాత ఎలాగైనా సరే బాక్సాఫీస్ వద్ద ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను కొట్టాలనే పట్టుదలతో అఖిల్ ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. ఆయన పడ్డ కష్టానికి తగ్గట్టే ఇటీవల విడుదలైన ట్రైలర్ ఇండస్ట్రీ వర్గాలను అమితంగా ఆకట్టుకుంది. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా, టాలీవుడ్‌కు చెందిన పలువురు టాప్ స్టార్ హీరోలు సైతం అఖిల్ మేకోవర్, యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌ను మెచ్చుకుంటూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపించారు. దీంతో ప్రమోషన్స్ విషయంలో నిర్మాతలు మరింత అగ్రెసివ్‌గా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఒకవేళ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ప్రచారం గనుక నిజమైతే, రిలీజ్ ముందే ఈ సినిమాకు వచ్చే హైప్, బిజినెస్ రేంజ్ ఊహించని స్థాయికి చేరుకోవడం ఖాయం. ఈ సెన్సేషనల్ కాంబో ఇంటర్వ్యూపై క్లారిటీ రావాలంటే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసేవరకు వెయిట్ చేయాల్సిందే...

ఇవి కూడా చదవండి:

Varanasi: క్రేజీ ఫొటో.. రాముడిగా మహేష్ బాబు లుక్ ఇదేనా

Bandla Ganesh: సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా.. న్యాయం సాధిస్తా..

ఒక్క సినిమా కోసం.. నాని రెండు చిత్రాలు వదిలేశాడా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy