Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒక్క సినిమా కోసం.. నాని రెండు చిత్రాలు వదిలేశాడా

ఒక్క సినిమా కోసం.. నాని రెండు చిత్రాలు వదిలేశాడా

Chitrajyothy 3 weeks ago

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) 'ద ప్యారడైజ్' (The Paradise) కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మూవీ వల్ల నాని రెండు సినిమాలు వదలుకోవాల్సి వచ్చిందట.

ఇదే ప్రస్తుతం సినీజనాల్లో డిస్కషన్‌గా మారింది. మరి ఇంతకూ నాని వదలు కొన్న ఆ సినిమాలేమిటో!?

నిర్మాత కోసం..

హీరో నాని తన 'దసరా' (Dasara) మూవీ దగ్గర నుంచీ గత యేడాది జనం ముందు నిలచిన 'హిట్-ద థర్డ్ కేస్' వరకు వరుసగా అలరిస్తూనే వచ్చారు. 'హిట్- 3' వచ్చేసి అప్పుడే ఏడాది దాటేసింది. అయినా నాని నుంచి మరో సినిమా వెలుగు చూడలేదని ఫ్యాన్స్ అంటున్నారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతోన్న 'ద ప్యారడైజ్' సినిమా పలు వాయిదాలు చూసింది. ప్రస్తుతం ఆగస్ట్ 21న విడుదలవుతోందని టాక్. ఈ మూవీ రిలీజై అన్ని పనులు పూర్తయ్యాక నాని హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో 'బ్లడీ రోమియో' సెట్స్‌కు వెళ్ళనుందని తెలుస్తోంది. ఆ సినిమా వచ్చే యేడాది వేసవికి వెలుగు చూస్తుందని సమాచారం. అన్నీ బాగా జరిగి ఉంటే 'ద ప్యారడైజ్' సినిమా ఏప్రిల్‌లో వెలుగు చూడాల్సింది. అనివార్య కారణాలతో 'ద ప్యారడైజ్' మేకింగ్‌లో జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. 'ద ప్యారడైజ్' డిలే కావడంతో నిర్మాతపై మరింత ఆర్థిక భారం పడినట్టే అని పరిశీలకుల మాట. ఆ కారణంగానే వేరే ప్రాజెక్ట్స్‌ను అంగీకరించకుండా నాని ఈ మూవీని పూర్తి చేశారని తెలుస్తోంది.

అలా ఆ రెండు...

అన్నీ సవ్యంగా సాగి ఉంటే నాని మరో రెండు సినిమాల్లో నటించాల్సి ఉంది. తనతో 'హాయ్ నాన్న' వంటి డీసెంట్ హిట్ తీసిన శౌర్యువ్ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పారు నాని. అయితే నాని 'ద ప్యారడైజ్' షూటింగ్ లోనే ఎక్కువ సమయం వెచ్చించాల్సి రావడంతో శౌర్యువ్ కథను పట్టాలెక్కించలేక పోయారు. అందువల్ల శౌర్యువ్‌ను వేరే అవకాశం వస్తే వెళ్ళమని నాని సూచించారు. అలా నాని కోసం శౌర్యువ్ తయారు చేసిన కథ ప్రస్తుతం విజయ్ దేవరకొండ చెంతకు చేరిందట. 'జై భీమ్' తమిళ డైరెక్టర్ టీజే జ్ఙానవేల్ కూడా నానికి తగ్గ ఓ సబ్జెక్ట్‌తో ఆయనను అప్రోచ్ అయ్యారు. అది కూడా నానికి బాగా నచ్చింది.. కానీ, 'ద ప్యారడైజ్' కారణంగా ఆలస్యమవుతోందని జ్ఞానవేల్ తోనూ సాగలేకపోయారు నాని. ప్రస్తుతం తన 'జై భీమ్'హీరో సూర్యతోనే జ్ఞానవేల్ ఓ కొత్త ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. అయితే నాని సబ్జెక్ట్‌కు, సూర్య సినిమా కథకు సంబంధం లేదని తెలుస్తోంది.

ఏం చేస్తారో...!?

'ద ప్యారడైజ్' అయ్యాక సుజీత్ దర్శకత్వంలో 'బ్లడీ రోమియో'లో నటించనున్నారు నాని. అంతా బాగానే ఉంది, సుజీత్ కూడా మరోవైపు పవన్ కళ్యాణ్‌తో 'ఓజీ-2' రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఒకవేళ నాని-సుజీత్ కాంబోలో 'బ్లడీ రోమియో' పట్టాలెక్కినా, సుజీత్ మరో ప్రాజెక్ట్ కారణంగా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి 'బ్లడీ రోమియో'ను 2027 వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అది సాధ్యమవుతుందా అన్నదే ప్రశ్న? 'ద ప్యారడైజ్' కోసం రెండు ప్రాజెక్ట్స్ వదలుకున్నట్టు నాని 'బ్లడీ రోమియో' పూర్తి చేసేలోగా ఇంకా ఏం చేస్తారో అన్న అనుమానాలూ ఉన్నాయి.. ఏమవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

దసరా బరిలో.. చిరంజీవి వర్సెస్ రజనీకాంత్ వర్సెస్ ధనుష్!

72nd National Awards: జ్యూరీ ఛైర్మన్ మలయాళీ కాబట్టి.. అల్లు అర్జున్‌కి డౌటేనా!?

National Award: మళ్లీ అల్లు అర్జున్‌కేనా? అదే జరిగితే చరిత్రే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy