Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' విధ్వంసం.. 2 డేస్ కలెక్షన్స్ ఎంతంటే

బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' విధ్వంసం.. 2 డేస్ కలెక్షన్స్ ఎంతంటే

Chitrajyothy 22 hrs ago

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ (Shiva Nirvana) కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన తాజా చిత్రం 'ఇరుముడి' (Irumudi).

విడుదలైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల విధ్వంసం సృష్టిస్తోంది. రవితేజ కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని విధంగా భారీ కలెక్షన్ల సునామీని కురిపిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 65.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను (Irumudi 2days Collections) సాధించి అల్టిమేట్ రికార్డును నెలకొల్పింది.

ఈ చిత్రం రవితేజ సినీ ప్రయాణంలోనే సరికొత్త చరిత్రను లిఖించింది. ఆయన కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్, అత్యధిక టికెట్ సేల్స్‌తో దూసుకుపోవడమే కాకుండా, నార్త్ అమెరికాలో కూడా ఆల్-టైమ్ రికార్డ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఏకంగా పాన్-ఇండియా చిత్రాలతో సమానంగా వసూళ్ల వేట సాగిస్తుండటం విశేషం. కేవలం 48 గంటల్లోపే మెజారిటీ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. ముఖ్యంగా రెండో రోజైన శనివారం హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఒక్క టికెట్ కూడా దొరకనంతగా దాదాపు 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి. మూడో రోజైన ఆదివారం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. రవితేజ కెరీర్‌లో ఇప్పటి వరకు లేని విధంగా ఫస్ట్ వీకెండ్‌కే (3 రోజులకే) రికార్డులు బద్దలయ్యేలా.. బాక్సాఫీస్‌ని ఈ సినిమా షేక్ చేస్తోంది.

అయ్యప్ప స్వామి నేపథ్యంతో పాటు తండ్రీకూతుళ్ల మధ్య సాగే అత్యంత బలమైన ఎమోషన్, శివ నిర్వాణ టేకింగ్, రవితేజ సహజసిద్ధమైన అద్భుత నటన ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పోటెత్తడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇది కేవలం రవితేజ ఒక్కడి విజయం మాత్రమే కాదని, సరైన కంటెంట్ వస్తే ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తారో నిరూపించిన తెలుగు సినిమా విజయమని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. లాంగ్ రన్‌లో ఈ చిత్రం మరిన్ని సరికొత్త మైలురాళ్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

Biopic Boom: బయోపిక్‌ల హవా.. తెరపైకి వస్తున్న సంచలన జీవితగాథలు!

జాంబీ రెడ్డి 2.. ఈ రేంజ్ లెవెల్ ఊహించలేదయ్యా వర్మా

Raviteja: రవితేజ మల్టీస్టారర్ మొదలయ్యేది అప్పుడే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy