Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిరు, చెర్రీ హనుమాన్ సెంటిమెంట్

చిరు, చెర్రీ హనుమాన్ సెంటిమెంట్

Chitrajyothy 3 weeks ago

తంలో డివోషనల్ మూవీస్‌లోనే దైవలీలలు కనిపించేవి. అడపా దడపా సోషల్ మూవీస్‌లోనూ ఫాంటసీ పేరుతో దేవుళ్ళను చూపించే వారు. అయితే ఈ మధ్య కాలంలో ఆ తరహా క్రియేటివ్ ఫ్రీడమ్‌ను మేకర్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు.

స్టార్ హీరోలైనా దైవిక బలంతోనే వారు విజయం సాధించినట్టుగా చూపించడం ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో ఆంజనేయ స్వామి అండ ఆయనకు లభించినట్టుగా చాలా వాటిల్లో చూపించారు.

కొన్ని సినిమాలలో చిరంజీవి (Chiranjeevi) సరదాగా 'హనుమంతుడి' గెటప్‌లోనూ కనిపించారు. అలానే ఆంజనేయ స్వామి గొప్పతనాన్ని తెలిపే పాటలు, సన్నివేశాలు ఆయన సినిమాల్లో అనేకం ఉన్నాయి. త్వరలో రాబోతున్న విశ్వంభర (Vishwambhara) లోనూ హనుమంతుడికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉంటాయని టీజర్ చూస్తే అర్థమౌతోంది. పైగా గతంలో వచ్చిన 'హనుమాన్' యానిమేటెడ్ మూవీకి చిరంజీవి డబ్బింగ్ చెప్పడం, తన బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ కు హనుమంతుడి లోగోనే పెట్టడం ఇవన్నీ మెగా కుటుంబానికి హనుమంతుడితో ఉన్న అనుబంధాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

'పెద్ది'లో హనుమంతుడి ఎపిసోడ్!

రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలోనూ హనుమంతుడికి సంబంధించిన ఓ ఎపిసోడ్ ఉందని చెబుతున్నారు. డైరెక్ట్ గా హనుమంతుడు సినిమాలో కనిపించకపోయినా.. ఆయాన ప్రభావాన్ని ఇందులో చూపించారని తెలుస్తోంది. రామ్ చరణ్ గదను భుజాన పెట్టుకుని ఉన్న సన్నివేశం, ఆ తర్వాత దానితో చేసే పోరాటం చూస్తే.. రామ్ చరణ్‌లో హనుమంతుడి అంశ కనిపిస్తుందని అంటున్నారు.

గతంలో 'ట్రిపుల్ ఆర్' క్లయిమాక్స్‌లో రామ్ చరణ్‌ను శ్రీరాముడి తరహాలో రాజమౌళి చూపించిన సంగతి తెలిసింది. ఆ సన్నివేశాలకు వచ్చిన అప్లాజ్‌ను దృష్టిలో పెట్టుకునే పెద్ది (Peddi Movie) దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) ఈ హనుమంతుడి ఎపిసోడ్ రాశాడని అంటున్నారు. ఇక ఇదే సమయంలో రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (janhvi kappor), శ్రుతీ హాసన్ పై పిక్చరైజ్ చేసిన స్పెషల్ సాంగ్ థియేటర్ లో మాస్ ఆడియెన్స్ తో విజిల్స్ వేయించడం ఖాయంగా కనిపిస్తోంది.

ట్రయాంగిల్ లవ్ స్టోరీ 'పెద్ది'!

ఇంతవరకూ 'పెద్ది' ఓ వ్యక్తి ఐడెంటిటీకి సంబంధించిన సినిమా అని, ఇది క్రాస్ ఓవర్ అధ్లెట్ కథ అని మాత్రమే మేకర్స్ చెబుతూ వచ్చారు. అయితే ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఈ చిత్రంలో నటించిన కీలక పాత్రధారి దివ్యేందు శర్మ 'పెద్ది' ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనే విషయాన్ని రివీల్ చేశాడు. దాంతో ఈ సినిమాలోని కొత్త కోణం బయటపడింది. ఫ్యాన్స్ కోసం రామ్ చరణ్ ఎంత కష్టమైన పడతాడని బొమన్ ఇరానీ కితాబిచ్చారు. ఈ సినిమాలో దర్శకుడు బుచ్చిబాబు సానా చెప్పినట్టే తాను చేశానని, అతనికి తామంత పెద్ద ఫ్యాన్స్ అని జాన్వీ తెలిపింది. ఈ సినిమా కథ గురించి గతంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు చెప్పానని రామ్ చరణ్ అన్నారు. జూన్ 4న పిల్లలతో కలిసి 'పెద్ది' చూడాల్సిందిగా ఆయన కోరారు. సో.. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న 'పెద్ది' ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా.. చదవండి

యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?

వీడు మాములోడు కాదు.. మర్డర్ కేసులో నిందితుడు! పేర్లు మార్చి.. స్టార్లతో 12 ఏళ్లుగా సినిమాలు

Mahesh Babu: నాన్ స్టాప్.. యాక్షన్‌లోకి మహేష్ బాబు?

దేవి శ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ'.. జోడీగా లక్కీ హీరోయిన్‌?

భానుడి భగభగ.. భామలు సలసల! కుర్రకారు విలవిల!!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy