Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డెలివరీ బాయ్ తో గొడవ.. అఖిల్ రాజ్ వాదన ఏంటి

డెలివరీ బాయ్ తో గొడవ.. అఖిల్ రాజ్ వాదన ఏంటి

Chitrajyothy 3 weeks ago

సోషల్ మీడియా యుగంలో ఒక చిన్న వీడియో క్లిప్ దొరికితే చాలు.. క్షణాల్లో జడ్జ్‌మెంట్లు ఇచ్చేయడం, ఒకరిని పూర్తిగా విలన్‌గా మార్చేయడం అలవాటుగా మారిపోయింది.

గత రాత్రి నుంచి రాజు వెడ్స్ రాంభాయి ఫేమ్ అఖిల్ రాజ్ (Akhil Raj) కి, ఒక డెలివరీ బాయ్‌కు మధ్య జరిగిన వివాదంలో కూడా ఇదే జరుగిందని కొందరు చెప్పుకొస్తున్నారు. తప్పు పార్శిల్ తీసుకువచ్చాడని ఆగ్రహంతో అఖిల్.. డెలివరీ బాయ్ పై దాడి చేసినట్లు ఒక వీడియొ వైరల్ గా మారింది. ఇక వైరల్ అవుతున్న కొన్ని సెకన్ల వీడియోను చూసి అఖిల్ రాజ్‌దే తప్పు అని సోషల్ మీడియా కోర్టులు తీర్పులు ఇచ్చేస్తున్నాయి. కానీ, ప్రతి గొడవ వెనుక రెండు వైపుల కథలు ఉంటాయనే కనీస సత్యాన్ని చాలామంది మర్చిపోతున్నారు. అసలు గొడవకు ముందు ఏం జరిగింది? అఖిల్ రాజ్ వెర్షన్ ఏంటి? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయడం లేదని పలువురు తమ అభిప్రయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

అసలు ఈ వివాదం వెనుక అసలు కథ వేరే ఉంది. అఖిల్ రాజ్ ఇంటికి ఒక తప్పు పార్సిల్ డెలివరీ అయ్యింది. అది తమదేనని భావించి ఆయన తల్లి ఆ పార్సిల్‌ను ఓపెన్ చేశారు. అయితే, సుమారు 20 నిమిషాల తర్వాత తిరిగి వచ్చిన డెలివరీ బాయ్.. అది వేరే వాళ్ల పార్సిల్ అని, వెనక్కి ఇచ్చేయాలని కోరాడు. అప్పటికే పార్సిల్ తెరిచి ఉండటాన్ని చూసి, సదరు డెలివరీ బాయ్ అఖిల్ రాజ్ తల్లితో ఎంతో రఫ్‌గా, అసభ్యంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. తేరగా వస్తే ఓపెన్ చేసేయటమేనా? చూసుకునే పని లేదా? అంటూ వృద్ధురాలని కూడా చూడకుండా తూలనాడటంతో ఇంట్లో ఉన్న అఖిల్ .. తన తల్లితో అలా మాట్లాడేసరికి కోపంతో అతడితో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. కళ్లముందే తల్లిని ఒకరు అలా నిందిస్తుంటే ఏ కొడుకైనా ఎలా ఊరుకుంటాడు? అందుకే అఖిల్ రాజ్ అక్కడ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు.

అక్కడ ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగిన విషయం నిజమే కావచ్చు.. కానీ అఖిల్ రాజ్ నిజంగానే సదరు డెలివరీ బాయ్‌ను కొట్టాడా లేదా అనేది పూర్తిగా తెలియదు. డెలివరీ బాయ్ కాబట్టి అతని వైపే పూర్తిగా న్యాయం ఉంటుందని, హీరో కాబట్టి అఖిల్ రాజ్‌దే తప్పు అని అతడిపై నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. హీరో అయితే ఎవరినైనా కొట్టవచ్చా.. అని మండిపడుతున్నారు. ఇందులో నిజానిజాలు తెలియకుండా అఖిల్ పై దుమ్మెత్తిపోయడంతో అతని కెరీర్ చిక్కులో పడే అవకాశం ఉంది. మరి ఈ వివాదంపి అఖిల్ రాజ్ మీడియా ముందుకు వచ్చి జరిగింది చెప్తాడా.. పోలీసులను ఆశ్రయిస్తాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.

ALSO READ: Bandla Ganesh: మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం

Ramayana: రామాయణ ట్రైలర్.. ప్రత్యేకత అదే

Director Samudra: డబ్బు వసూలు చేసినా.. పేరు వాడినా.. ఊరుకోను

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy