Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హరిరామజోగయ్య కుమారుడిపై గేయ రచయిత అనంత శ్రీరామ్ ఫిర్యాదు

హరిరామజోగయ్య కుమారుడిపై గేయ రచయిత అనంత శ్రీరామ్ ఫిర్యాదు

Chitrajyothy 0 months ago

సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ (Anantha Sriram) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో ఫిర్యాదు చేశారు.

యలమంచిలి మండలం, దొడ్డిపట్ల గ్రామంలోని తమ ఇంటి ముందు ఉన్న ఐదు సెంట్ల ఉమ్మడి స్థలాన్ని మాజీ మంత్రి హరిరామజోగయ్య (Chegondi Harirama Jogaiah) కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ (Surya Prakash) ఆక్రమించారంటూ ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ స్థల వివాదం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని అనంత శ్రీరామ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ, సూర్యప్రకాష్ తమను నిరంతరం బెదిరింపులకు గురిచేస్తూ తీవ్ర మానసిక హింసకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదం కారణంగా దొడ్డిపట్లలో ఉంటున్న తన వృద్ధులైన తల్లిదండ్రుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వారికి తక్షణమే రక్షణ కల్పించాలని అనంత శ్రీరామ్ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారిలను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన అధికారులను కోరారు.

ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇవి ఫ్యామిలీ ఇష్యూస్ అని, ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయనేలా నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. మరోవైపు గీత రచయితగా అనంత శ్రీరామ్ దూసుకెళుతున్నారు. తాజాగా ఆయన సాహిత్యం అందించిన 'పెద్ది' సినిమాలోని పాటలు ట్రెండ్‌ని షేక్ చేస్తున్నాయి. 'రై రై రారా' సాంగ్ ఇప్పటికే ఓ ఊపు ఊపేసింది. తాజాగా వచ్చిన స్పెషల్ సాంగ్ 'హల్లల్లల్లో' సాంగ్ కూడా చార్ట్ బస్టర్ దిశగా వెళుతోంది. ఈ పాటలో రామ్ చరణ్‌ గ్రేస్‌ఫుల్ డ్యాన్స్‌కు అంతా ఫిదా అవుతున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్‌తో పాటు, శృతి హాసన్ కూడా ఈ పాటలో మెరిశారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇవి కూడా చదవండి:

ఎగ్జిబిటర్ల పరిస్థితి చూసి జాలేస్తోంది: బాలకృష్ణ

10 కోట్ల బడ్జెట్.. 1000 కోట్ల కలెక్షన్స్?.. ఇది కదా సక్సెస్ అంటే?

జస్‌ప్రీత్ బుమ్రాకు సారీ చెప్పిన రామ్‌చరణ్.. అసలు విషయమిదే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy