Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జస్‌ప్రీత్ బుమ్రాకు సారీ చెప్పిన రామ్‌చరణ్.. అసలు విషయమిదే!

జస్‌ప్రీత్ బుమ్రాకు సారీ చెప్పిన రామ్‌చరణ్.. అసలు విషయమిదే!

Chitrajyothy 1 month ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) తాజాగా సోషల్ మీడియా వేదికగా భారత స్టార్ క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన 'పెద్ది' (Peddi) వేడుకలో జనాల హడావుడి, కోలాహలం మధ్య బుమ్రా పేరు విషయంలో చిన్న పొరపాటు జరిగిందని, అది పూర్తిగా పొరపాటున జరిగిందేనని చరణ్ క్లారిటీ ఇచ్చారు. ''కొన్నిసార్లు పేర్లను గుర్తుపెట్టుకోవడంలో నేను చాలా మతిమరుపుగా వ్యవహరిస్తాను. ఆ ఉత్సాహం, జనం మధ్యలో.. కేవలం సహజంగా జరిగిన చిన్న పొరపాటు మాత్రమే. జస్‌ప్రీత్ బుమ్రాకు నా క్షమాపణలు'' అంటూ చరణ్ ట్వీట్ చేశారు.

అసలేం జరిగిందంటే.. 'పెద్ది' సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌ మూవీ కావడంతో.. భోపాల్ ఈవెంట్‌కు యాంకర్‌గా వ్యవహరించిన వ్యక్తి.. రామ్ చరణ్‌ను క్రికెటర్ల గురించి కొన్ని ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగారు. సచిన్ టెండూల్కర్, ఎమ్.ఎస్. ధోని, రోహిత్ శర్మ, కోహ్లీ గురించి అడిగినప్పుడు.. తన మనసులో ఏముందో టక్కున చెప్పేసిన రామ్ చరణ్.. బుమ్రా విషయంలో మాత్రం ట్రాక్ తప్పారు. బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్ అనుకుని, అతనికి పెద్ద ఫ్యాన్‌ని అని చెప్పారు. ఇక్కడే కాంట్రవర్సీ మొదలైంది. అయితే వెంటనే సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పడంతో.. ఈ కాంట్రవర్సీకి వెంటనే చరణ్ తెరదించారు.

సాధారణంగా స్టార్ సెలబ్రిటీలు తాము చేసిన చిన్న పొరపాట్లను పెద్దగా పట్టించుకోరు. కానీ రామ్ చరణ్ స్వయంగా ట్విట్టర్ వేదికగా బుమ్రాను ట్యాగ్ చేస్తూ ఇంత హుందాగా సారీ చెప్పడం ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌తో పాటు.. క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే వేడుకలో రామ్ చరణ్ మరో పొరపాటు కూడా చేశారు. ఈ వేడుక జరిగింది 'భోపాల్‌'లో అయితే.. ''మా 'బీహార్' ప్రేక్షకుల కోసం 'పెద్ది' థీమ్ సాంగ్‌ని వినిపించగలరు'' అంటూ ఏఆర్ రెహమాన్‌ని చరణ్ రిక్వెస్ట్ చేశారు. భోపాల్ బదులుగా బీహార్ అని పలకడం.. కూడా చరణ్‌పై ట్రోలింగ్‌కు కారణమవుతోంది. అయితే.. 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ టైమ్‌లో రామ్ చరణ్‌కు ఉన్న మతిమరుపు గురించి, మరీ ముఖ్యంగా ఇలా పేర్లు గుర్తు పెట్టుకునే విషయంలో ఎలా ప్రవర్తిస్తుంటాడో.. ఎన్టీఆర్ చాలా విపులంగా తెలిపిన విషయం తెలిసిందే. అందుకే మెగా ఫ్యాన్స్ ఈ విషయాన్ని పెద్దదిగా చూడాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

అల్లు అయాన్‌కు ఆర్‌సీబీ ప్లేయర్ స్పెషల్ గిఫ్ట్.. బన్నీ పోస్ట్ వైరల్!

40 ఏళ్ల తర్వాత సీక్వెల్‌కు ప్లాన్.. ఈ మూవీ వివరాలు తెలిస్తే షాకే!

ఏయన్నార్ నటవారసునిగా మెప్పించిన నాగార్జున

MEGA158: 'దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్'.. టైటిల్ లీక్ చేసేస్తా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy