Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హీరోయిన్లను అలా లాగుతున్నాడేంటి? దర్శకేంద్రుడి పై మరోసారి విమర్శలు

హీరోయిన్లను అలా లాగుతున్నాడేంటి? దర్శకేంద్రుడి పై మరోసారి విమర్శలు

Chitrajyothy 4 days ago

లెజెండరీ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు (K. Raghavendra Rao) మరోసారి వార్తలలో హైలెట్ అవుతున్నారు. ఆమధ్య మెగా డాటర్ నిహారిక (Mega Daughter Niharika) నడుంపై చేయి వేసి, దగ్గరకు తీసుకుంటున్న వీడియోలతో దర్శకేంద్రుడిపై భారీగా ట్రోలింగ్ నడిచింది.

ఇప్పుడు మరోసారి అలానే ఆయన ప్రవర్తించడంతో.. యంగ్ హీరోయిన్ల విషయంలో ఈ లెజెండరీ దర్శకుడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడనేలా.. కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌కు కారణం.. గురువారం గ్రాండ్‌గా ప్రారంభమైన వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబో చిత్రమే.

ఈ మూవీ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకేంద్రుడు.. ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. అందులో భాగంగా ఆయన హీరోయిన్లకు సీన్ వివరిస్తుండగా.. దానిని క్యాప్చర్ చేసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో కీర్తి సురేష్ (Keerthy Suresh), కృతి శెట్టి (Krithi Shetty)లను రాఘవేంద్రరావు సీన్‌కి అనుగుణంగా రెడీ చేస్తున్నారు. కానీ, చూసే వారికి అది మరోలా అర్థమవుతోంది. గతంలో నిహారిక విషయంలో కూడా అంతా అపార్థమే చేసుకున్నారు. నిహారిక తన కళ్ల ముందు పెరిగిన అమ్మాయి. మెగా ఫ్యామిలీతో దర్శకేంద్రుడికి ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కెరీర్‌లోని ఎన్నో అద్భుతమైన చిత్రాలను రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. చిరంజీవిని ప్రేమగా ఆయన 'బాబాయ్' అని పిలుస్తుంటారు. అలాంటిది నిహారికను ఒక డాటర్‌లా దగ్గరకు తీసుకుని ప్రోత్సహించారు తప్పితే వేరొకటి కాదు.

ఇప్పుడు కూడా.. కీర్తి సురేష్, కృతి శెట్టిలను సీన్ కోసం రెడీ చేస్తున్నారు తప్పితే.. అందులో తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏం లేదు. సేమ్ రాఘవేంద్రరావు ఎలా అయితే సీన్ చెప్పారో.. ఆ సీన్‌కే క్లాప్ పడింది. ఒక అగ్ర దర్శకుడిగా ఆయనకు ఉండే ఫ్రీడమ్ అది. అంతే తప్పితే.. ఆయనను ఇందులో విమర్శించాల్సిన, ట్రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది కేవలం షూటింగ్ ప్రక్రియలో భాగంగానే జరిగింది. అయినా ఒక అగ్ర దర్శకుడు.. ప్రస్తుత జనరేషన్‌తో అంత చక్కగా కలిసిపోయి ఉండటాన్ని కూడా తప్పుగా చూస్తే.. అసలాయన ఫామ్‌లో ఉన్నప్పుడు షూటింగ్ చూస్తే.. ఇప్పుడు ట్రోల్ చేసే వారంతా గుండెలు బాదేసుకుంటారేమో? ఆయనొక క్రియేటివ్ జీనియస్.. అలాంటి వ్యక్తిని పట్టుకుని, సగం సగం వీడియోలు చూసి ట్రోల్ చేస్తున్నారంటే.. కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ దర్శకేంద్రుడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Maa Inti Bangaram Movie Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ

హాజరు కావాల్సిందే.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

నా భర్త నుంచి ప్రాణహాని: నటుడి మొదటి భార్య

NBK111: కళ్లజోడు పెట్టిన కాజల్.. బాలయ్య మూవీలో లుక్ వచ్చేసింది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy