Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నా భర్త నుంచి ప్రాణహాని: నటుడి మొదటి భార్య

నా భర్త నుంచి ప్రాణహాని: నటుడి మొదటి భార్య

Chitrajyothy 5 days ago

న భర్త, ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ శరవణన్‌ (Saravanan) నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన మొదటి భార్య సూర్యశ్రీ (Suryasri) ఆరోపించారు. ఈ విషయంపై ఆమె చెన్నై నగర శివారు ప్రాంతమైన మౌలివాక్కం పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు చేశారు.

నటుడు శరవణన్‌.. మొదట సూర్యశ్రీ అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2019లో శ్రీదేవి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. వీరంతా మౌలివాక్కంలోని ఒక అపార్టుమెంట్‌లోని ఎదురెదురు ఫ్లాట్‌లలో ఉంటున్నారు. ఒక ఫ్లాట్‌లో శరవణన్‌ - శ్రీదేవి, మరో ఫ్లాట్‌లో సూర్యశ్రీలు ఉంటున్నారు.

అయితే సూర్యశ్రీ ఫ్లాట్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలు తొలగించారు. దీనిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా చేయడంతో తన భర్త నుంచి తన ప్రాణాలకు హాని ఉందని, అందువల్ల తన ఫ్లాట్‌లో తొలగించిన సీసీటీవీ కెమెరాలను తిరిగి అమర్చాలని కోరుతూ మౌలివాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. వాస్తవానికి శరవణన్‌పై ఆమె ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు విడాకులు ఇవ్వకుండానే ఆయన మరొకరితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నట్లుగా గతంలో ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

శరవణన్ రెండో పెళ్లికి సంబంధించి కూడా న్యాయపరమైన చర్యలు జరుగుతున్నట్లు సూర్యశ్రీ పేర్కొన్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి వివాహానికి సంబంధించిన విడాకుల ప్రక్రియ పూర్తి కాకముందే ఈ రెండో పెళ్లి జరిగిందని, అందువల్ల ఆ వివాహం చెల్లుబాటు కాదంటూ ఆమె ప్రశ్నించారు. ఇక ఈ తాజా ఆరోపణలపై సదరు నటుడు ఇప్పటివరకు స్పందించనప్పటికీ, పోలీసులు ఇప్పుడు ఈ ఫిర్యాదుపై విచారణను చేపట్టారు. శరవణన్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, రాబోయే కొద్ది రోజుల్లో ఏం జరగబోతోందా అని ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శరవణన్ విషయానికి వస్తే.. 'పరుత్తివీరన్' సినిమాతో ఆయనకు చాలా మంచి పేరు వచ్చింది. తమిళ్‌లో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన ఆయన.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

NBK111: కళ్లజోడు పెట్టిన కాజల్.. బాలయ్య మూవీలో లుక్ వచ్చేసింది

'మకుటం' ఫస్ట్ సింగిల్ అప్డేట్.. అందుకే ఆలస్యమైంది!

డిప్యూటీ సీఎంగా లారెన్స్.. అభిమానులతో జాగ్రత్త!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy