Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంకా మొదలెట్టకుండానే.. కాంట్రవర్సీలో 'గాడ్ ఆఫ్ వార్'

ఇంకా మొదలెట్టకుండానే.. కాంట్రవర్సీలో 'గాడ్ ఆఫ్ వార్'

Chitrajyothy 3 weeks ago

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కలయికలో ఓ మైథాలజికల్ ఫిల్మ్ రానున్న సంగతి తెలిసిందే.

'అరవింద సమేత' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ చిత్రానికి 'గాడ్ ఆఫ్ వార్' (God Of War) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇంకా ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లకుండానే.. ఈ ప్రాజెక్ట్ చుట్టూ వివాదాలు కూడా మొదలయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఈ సినిమాను తక్షణమే నిలిపివేయాలంటూ నామ్ తమిళర్ కట్చి (NTK) పార్టీ అధినేత సీమాన్ డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. తమిళుల ఇష్ట దైవమైన మురుగన్‌ను ఉత్తరాంధ్ర దైవంగా చూపించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడుకే చెందిన దైవమనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, తమిళుల మనోభావాలను కించపరిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఒకవేళ సినిమాను ఆపకపోతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని సీమాన్ హెచ్చరికలు జారీ చేశారు. అంతే, అనౌన్స్‌మెంట్‌కే ఇలాంటి కాంట్రవర్సీ మొదలైతే.. ఇక సెట్స్‌పైకి వచ్చేనాటికి ఇంకెలా ఉంటుందో అనేలా అప్పుడే టాక్ మొదలైంది. చూడాలి మరి.. ఈ వివాదాన్ని చిత్రయూనిట్ ఎలా పరిష్కరిస్తుందో..

ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ మైథలాజికల్ ప్రాజెక్టును నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన పూర్తి వివరాలు రాబోయే రోజుల్లో అధికారికంగా వెల్లడి కానున్నాయి. ఒకవైపు రాజకీయ వివాదాలు, మరోవైపు స్టార్ హీరోల క్యామియో రోల్స్ వార్తలతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. మొత్తంగా అయితే.. అనౌన్స్‌మెంట్ నుంచే ఈ సినిమా వార్తలలో ఉండేందుకు సరిపడా సరంజామా అయితే సిద్ధమవుతోందని మాత్రం తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

ప్రభాస్‌తో 'ధురంధర్' దర్శకుడి మూవీ.. అధికారిక ప్రకటన ఆరోజేనా!

ప్రశ్నించడం అంటే ఇదేనా? రావణ్‌పై రామ్ తాళ్లూరి ఫైర్

Spirit: 'స్పిరిట్‌' పరుగులే.. సందీప్‌ వంగా స్పీడ్‌కు ఫ్యాన్స్ హ్యాపీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy