Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఇరుముడి' నుంచి మరో సాంగ్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే

'ఇరుముడి' నుంచి మరో సాంగ్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే

Chitrajyothy 2 weeks ago

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా నటిస్తోన్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఇరుముడి' (Irumudi). శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాణంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన 'ఫస్ట్ గ్లింప్స్', చార్ట్‌బస్టర్ అయ్యప్ప భక్తి పాట 'ఇరుముడి కట్టు' ఎలాంటి ఆదరణను సొంతం చేసుకున్నాయో తెలియంది కాదు.

ముఖ్యంగా అయ్యప్ప పాట ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను విడుదల చేయబోతున్నట్లుగా అప్డేట్ ఇచ్చారు.

సెకండ్ సింగిల్ అప్డేట్‌తో వచ్చిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 'ఎలాలో ఎలాలో' అంటూ సాగే ఈ పాటను ఆగస్ట్ 3, ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా ఈ పోస్టర్‌లో తెలిపారు. పోస్టర్‌ని గమనిస్తే.. రవితేజ తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నట్లుగా భార్య, బిడ్డలను ఇందులో చూపించారు. రవితేజ ఆటో నడుపుతుండగా, ఆయన కుమార్తె బుగ్గపట్టుకుని మెచ్చుకుంటోంది. భార్య ప్రియా భవానీ శంకర్ తదేకంగా రవితేజనే చూస్తూ ఉంది. ఈ పోస్టర్ ఫ్యామిలీ బాండింగ్ చాలా గొప్పగా ఇందులో చూపించబోతున్నారనే హింట్‌ని ఇస్తోంది.

మరో వైపు ఈ మూవీ విడుదల తేదీకి సంబంధించి నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ, అనుకున్న సమయానికే అంటే ఆగస్ట్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేసింది. విడుదల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేస్తూ కౌంట్ డౌన్ పోస్టర్స్ కూడా టీమ్ విడుదల చేస్తోంది. కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు శివ నిర్వాణకు మంచి పేరుందనే విషయం తెలిసిందే. ఆయన ఈ 'ఇరుముడి' చిత్రాన్ని ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇకపై వరుస అప్డేట్స్ రానున్నాయని మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

'ఫౌజీ'లో ప్రభాస్ మదర్‌గా ఎవరో తెలుసా..

'వారణాసి' తర్వాత జక్కన్న ప్లాన్ ఏంటి? చిన్న సినిమానా.. లేక

కొరియాలో షూట్ చేసినా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు: మెగా ప్రిన్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy