Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jagapathibabu: సాలీడ్‌ కాన్సెప్ట్ బేస్‌తో 'వదలా'

Jagapathibabu: సాలీడ్‌ కాన్సెప్ట్ బేస్‌తో 'వదలా'

Chitrajyothy 3 weeks ago

గపతిబాబు, లయ జంటగా నటించిన చిత్రం 'వదలా'. ఇందులో హృతికా శ్రీనివాస్ ఓ కీలక పాత్రను పోషించారు. కిశోర్‌ నాయుడు చిరుమమిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించిన ఈ సినిమాను ఆకెళ్ళ వి కృష్ణ డైరెక్ట్ చేశారు.

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఈ నెల 17న విడుదల కాబోతోంది.

యోగి తన భార్యను అమితంగా ప్రేమించే భర్త. ఆమెనే తన ప్రపంచంగా భావిస్తాడు. ఆమె కూడా అతనిపై అపారమైన ప్రేమతో, వారి బంధాన్ని ఎవరూ చెడగొట్టకూడదని కోరుకుంటుంది. అయితే, కుటుంబానికి దగ్గరగా ఉండే ఒక యువతి రాకతో వారి ప్రపంచం తలక్రిందులు అవుతుంది. యోగిపై ఆమెకు ఏర్పడే భావోద్వేగం క్రమంగా వ్యామోహంగా మారి, అతని ప్రేమను పొందడానికి ఆమె ఎలాంటి హద్దులనైనా దాటడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ ముగ్గురి జీవితాలు ఆ యువతి ఆగమనంతో ఎలాంటి మలుపులు తిరిగాయన్నదే 'వదలా' చిత్రం. ఈ అంశాన్ని బేస్ చేసుకుని రూపుదిద్దుకున్న చిత్రమే 'వదలా'.

'ఓల్డ్ మాన్ - యంగ్ గర్ల్' కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా తప్పకుండా ఘన విజయాన్ని సాధిస్తుందనే విశ్వాసాన్ని జగపతిబాబు వ్యక్తం చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, 'హృతిక ఈ సినిమాలో భయపెట్టేసింది. లయ అద్భుతంగా నటించింది. డైరెక్టర్ వంశీ సినిమాను చాలా చక్కగా తీశాడు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను' అని అన్నారు. వైర్సటైల్ యాక్టర్ జగపతిబాబుతో మరోసారి కలిసి నటించడం ఆనందంగా ఉందని లయ తెలిపారు.

చిన్న చిత్రాల మధ్య గట్టిపోటీ!

ఇదిలా ఉంటే... జూలై 17, 18 తేదీలలో ఇప్పటికే ఐదు చిత్రాలు కర్చీఫ్ వేసేశాయి. 17వ తేదీ తీరువీర్, ఐశ్వర్య రాజేశ్‌ 'ఓ సుకుమారి', 'రాజా ది రాజా' చిత్రాలు వస్తున్నాయి. అలానే ఆర్జీవీ 'రక్త చరిత్ర' రీ-రిలీజ్ కాబోతోంది. ఇక 18వ తేదీ కిరణ్‌ అబ్బవరం 'చెన్నయ్ లవ్ స్టోరీ', 'వెంకట్రామయ్య గారి తాలుకా' చిత్రాలు విడుదల కాబోతున్నాయి. వీటికి ఇప్పుడు తాజా 'వదలా' కూడా జత కలిసింది. రాబోయే రెండు వారాల్లో ఇంకేమైనా సినిమాలు ఇదే తేదీని వస్తాయేమో తెలియదు. మొత్తం మీద జూలై మూడో వారంలో థియేటర్ల దగ్గర చిన్న చిత్రాల జాతర జరుగబోతోందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి:

ఎట్టకేలకు.. విజయ్ 'జన నాయగన్' సెన్సార్ పూర్తి?

Kayadu Lohar: టెన్త్ క్లాస్‌లోనే అంత పని చేసిందా?

వైజయంతీ మూవీస్ బ్యానర్ రూటే వేరు.. బ్రాండ్ అంటే ఇది!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy