Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైజయంతీ మూవీస్ బ్యానర్ రూటే వేరు.. బ్రాండ్ అంటే ఇది!

వైజయంతీ మూవీస్ బ్యానర్ రూటే వేరు.. బ్రాండ్ అంటే ఇది!

Chitrajyothy 3 weeks ago

టాలీవుడ్‌లో కొన్ని టాప్ బ్యానర్స్ ఉన్నాయి. వాటిలో వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) ఒకటి. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ సంస్థకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువే.

వైవిధ్యభరితమైన చిత్రాలతో అప్పుడెలా అయితే పేరుని తెచ్చుకుందో.. ఇప్పుడు కూడా ఆ పేరును నిలబెట్టుకోవడమే కాదు.. ఒక బ్రాండ్‌గా పిలుచుకునేలా ఈ సంస్థ మారిందంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ విషయాలను పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో ఈ సంస్థ నుంచి వస్తోన్న చిత్రాలు ఎంతో వైవిధ్యతతో ఉండటం విశేషం. రొటీన్, రొట్ట సినిమాలు కాకుండా.. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనాన్ని పరిచయం చేస్తూ.. ఈ సంస్థ దూసుకెళుతోంది.

కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అందుకు కారణం యంగ్ జనరేషనే. ఒకే టైపు సినిమాలకు స్వస్తి పలుకుతూ.. సినిమాసినిమాకు వైవిధ్యతను కనబరుస్తూ.. క్రియేటివ్ ఫ్రీడమ్‌ గొప్పతనమేంటో ఈ సంస్థ తెలియజేస్తోంది. ఈ విషయంలో ఎన్నో సంస్థలకు ఈ సంస్థ స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మార్పు నాగ్ అశ్విన్‌తోనే మొదలైంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమా ఇప్పుడు ఎంతో మందికి ఫేవరేట్ సినిమాగా ఉందంటే.. అందులో ఉన్న కంటెంట్‌తో పాటు క్రియేటివ్ ఫ్రీడమ్‌కు ఈ సంస్థ ఇచ్చిన ఇంపార్టెన్సే అని చెప్పుకోవాలి.

అప్పటి నుంచి వరసగా.. 'మహానటి', 'జాతిరత్నాలు', 'సీతా రామం', 'కల్కి 2898 AD'.. ఇంకా రీసెంట్‌గా వచ్చిన 'సింగ్ గీతం'. ఈ సినిమాలను గమనిస్తే.. వేటికవే ప్రత్యేకతను చాటుకున్నాయి. ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర నిలబడిన చిత్రాలే. ఇవి కాకుండా 'ఛాంపియన్' వంటి మరో సంచలన చిత్రం కూడా ఈ బ్యానర్ నుంచే వచ్చింది. ఈ సినిమా ఫెయిల్ అయి ఉండవచ్చు కానీ.. ఈ బ్యానర్ ప్రతిష్టను మరింత పెంచిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇలా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల జోలికి వెళ్లకుండా.. ప్రేక్షకులకు ఏదో ఒక కొత్తది ఇవ్వాలని ఈ సంస్థ, దాని వెనుక ఉన్న నిర్మాతలు పడే తాపత్రయయే.. ఇంకా 'వైజయంతీ మూవీస్' పేరుని చెక్కుచెదరకుండా నిలబెడుతున్నాయి. మాములుగానే ఈ సంస్థకి ఒక బ్రాండ్ ఉంది. జనరేషన్ మారిన తర్వాత ఇలాంటి బ్రాండ్ ఉన్న సంస్థలు చాలా వరకు కనుమరుగయ్యాయి. కానీ, 'వైజయంతీ మూవీస్' మాత్రం తన బ్రాండ్ వేల్యూని మరింత పెంచుకుంటోంది. అందుకు కారణం నాగ్ అశ్విన్‌తో పాటు అశ్వినీ దత్ కుమార్తెలు స్వప్న, ప్రియాంకల కృషే అని చెప్పకతప్పదు. నిజంగా అశ్వినీ దత్ ఈ విషయంలో అదృష్టవంతుడే.. అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారంటే.. ఎంత పట్టుదలతో వారు ఈ సంస్థను రన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

PKCW: సినీ ఆశావహులకు పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్

'అంబ'స్ రివెంజ్'.. ఈ సినిమా స్పెషల్ ఏంటో తెలుసా

'కాగితం పడవలు' చిత్రబృందం చేసిన పనికి చిరు ఫిదా.. ఏం చేశారంటే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy