Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లవ్ గురుగా రమ్యకృష్ణ

లవ్ గురుగా రమ్యకృష్ణ

Chitrajyothy 3 weeks ago

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ వార్త వైరల్ అవుతుందో చెప్పలేం. తాజాగా సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తోంది.

వెండితెరపై తన నటనతో, గంభీరమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన రమ్యకృష్ణ ఇప్పుడు సరికొత్త అవతారంలో అలరించడానికి సిద్ధమయ్యారు.

'బాహుబలి'తో శివగామిగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి రమ్యకృష్ణ... ఇప్పుడు మరో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బిగ్ స్క్రీన్ నుంచి బుల్లితెరపై మరో ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతోంది. తమిళ రియాలిటీ సిరీస్ 'సెకండ్ లవ్'కు ఆమె హోస్ట్‌గా వ్యవహరించబోతుండటం ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్ వేదికగా తెరకెక్కుతున్న 'సెకండ్ లవ్' అనే రియాలిటీ షోకు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు.

ఇప్పటి వరకు వచ్చిన సాధారణ డేటింగ్ షోలకు భిన్నంగా, ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ షో రాబోతోంది. బనిజయ్ ఆసియా నిర్మిస్తున్న ఈ షో జులై 13 నుంచి జియో హాట్‌స్టార్‌లో హాట్‌స్టార్ స్పెషల్స్ బ్యానర్‌పై స్ట్రీమింగ్ కానుంది. విఫలమైన సంబంధాలు లేదా వివాహాలను ఎదుర్కొన్న 30 ఏళ్ల వయసు పైబడిన 12 మంది సింగిల్ కంటెస్టెంట్లు ఒక విల్లాలో కలిసి ఉంటూ... మనసుకైన గాయాలను మాన్పుకుంటూ, తమను తాము తెలుసుకుంటూ, మళ్లీ ప్రేమను వెతుక్కునే ప్రయాణాన్ని ఈ షో ఆవిష్కరించనుంది.

ఇటీవల విడుదలైన సినిమాటిక్ మ్యూజికల్ ప్రోమోకు అనుషా విశ్వనాథన్ దర్శకత్వం వహించగా దీనితో వీక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. బిగ్‌బాస్ తమిళ్ ఫేమ్ శృతిక అర్జున్ కూడా ఈ షోలో పాల్గొంటుండటంతో తమిళ తంబీల్లో అప్పుడే క్యూరియాసిటీ మొదలైంది. ఇక ఈ షోకు అలెక్స్ శామ్యూల్ జెనిటో సంగీతం అందించారు. తన గంభీరమైన నటనతో మెప్పించిన రమ్యకృష్ణ, ఇప్పుడు హోస్ట్‌గా ఈ 'సెకండ్ లవ్' షో ద్వారా ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుందో చూడాలి!

ఇవి కూడా చదవండి:

PKCW: సినీ ఆశావహులకు పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్

'అంబ'స్ రివెంజ్'.. ఈ సినిమా స్పెషల్ ఏంటో తెలుసా

'కాగితం పడవలు' చిత్రబృందం చేసిన పనికి చిరు ఫిదా.. ఏం చేశారంటే,,

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy