Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'లవ్ యు కళ్యాణ్'.. మెగా158 లాంచ్‌పై చిరు ట్వీట్ వైరల్!

'లవ్ యు కళ్యాణ్'.. మెగా158 లాంచ్‌పై చిరు ట్వీట్ వైరల్!

Chitrajyothy 3 days ago

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), బాబీ (Bobby) కాంబినేషన్‌లో 'వాల్తేరు వీరయ్య' తర్వాత మరోసారి రూపుదిద్దుకోబోతోన్న చిత్రం, గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరుపుకుంది.

ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ముఖ్య అతిథులుగా హాజరవుతారని మేకర్స్ ప్రకటించారు. కానీ, ఈ వేడుకకు రామ్ చరణ్ హాజరు కాలేదు కానీ, పవన్ కళ్యాణ్ హాజరై.. ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. మెగా బ్రదర్స్ ముగ్గురూ ఈ వేడుకలో కలిసి కనిపించడంతో.. అభిమానులు ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. రామ్ చరణ్ కూడా వచ్చి ఉంటే, వారి ఆనందం డబుల్ అయ్యేది. అయినా సరే, చిరు-పవన్ ఇద్దరూ ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

'మెగా158' చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోందనేది ఈ ప్రారంభోత్సవ వేడుక చూస్తుంటేనే అర్థమవుతోంది. ఈ వేడుకలో దర్శకుడు వివి వినాయక్ సమక్షంలో మెగా డాటర్ సుష్మిత కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. నాగబాబు, బి. గోపాల్, కోదండ రామిరెడ్డి కలిసి స్క్రిప్ట్‌ను దర్శకుడు బాబీ, నిర్మాత వెంకట్ కె నారాయణలకు అందచేశారు. ఈ వేడుకకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వేడుక అనంతరం చిరంజీవి తన ఎక్స్ ఖాతా వేదికగా.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు థ్యాంక్యూ చెప్పారు.

''ఈ రోజు కళ్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే.. 30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'కి జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది. ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో టైమ్ తీసుకుని వచ్చి, నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులందరినీ ఆనందపరిచినందుకు థ్యాంక్యూ. లవ్ యూ కళ్యాణ్. చిరు బాబీ కాంబోలో రెండో చిత్రం మొదలైంది'' అని చిరంజీవి తన సంతోషాన్ని ఈ ట్వీట్‌ ద్వారా తెలియజేశారు. 'ఆనాటి రామలక్ష్మణులు ఎలా ఉంటారో తెలుసు.. కానీ చూడలేదు. మిమ్మల్ని చూస్తున్నాం' అన్నయ్యా.. అంటూ అభిమానులు అప్యాయంగా ఈ ట్వీట్‌కు రియాక్ట్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Drishyam 3: దృశ్యం 3 మూవీ రివ్యూ

చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!

Peddi Movie: 24 గంటల్లో 'పెద్ది' ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!

యంగ్ టైగర్‌కు పవర్ స్టార్ బర్త్‌డే విషెస్.. ట్వీట్ వైరల్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy