Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లయని చూసి ఎవరీ కొత్త హీరోయిన్ అనుకున్నా: శ్రీకాంత్

లయని చూసి ఎవరీ కొత్త హీరోయిన్ అనుకున్నా: శ్రీకాంత్

Chitrajyothy 2 weeks ago

శ్రీకాంత్ (Srikanth), లయ (Laya) హీరో హీరోయిన్లుగా.. నటకిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad ప్రధాన పాత్రలో, దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి రూపొందిస్తోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ 'మిస్టర్ మిడిల్ క్లాస్' (Mister Middle Class).

జీకే అండ్ సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి గెస్ట్‌లుగా వచ్చిన డైరెక్టర్ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డిలకు ధన్యవాదాలు. ఈ మధ్య చాలా సినిమాల వేడుకలకు గెస్ట్‌గా వచ్చాను. ఇప్పుడీ వేడుకలో మాట్లాడుతుంటే.. గెస్ట్‌నా, హీరోనా అని నాకే డౌట్ వస్తోంది. చాలా రోజుల తర్వాత నేను హీరోగా నటించిన నా సినిమా టీజర్ లాంచ్‌కు రావడం ఆనందంగా వుంది. గంగుల కమలాకర్ ఫోన్ చేసి ఒక మంచి ఎంటర్‌టైనర్ చేద్దామని చెప్పారు. నేను వెంటనే ఖచ్చితంగా చేద్దామని చెప్పాను. నాగేశ్వర్ రెడ్డి దర్శకుడు అని తెలిసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే సినిమా చేసి చాలా రోజులైంది. చాలా రోజుల తర్వాత మళ్లీ అలాంటి చక్కని సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది.

నిజంగా ఈ సినిమా చేస్తున్నంతసేపూ అంతా చాలా ఎంజాయ్ చేశాం. మరీ ముఖ్యంగా నాకు పాత రోజులు గుర్తొచ్చాయి. చాలా ఎంజాయ్ చేశా. ఇందులో మురళీధర్ నా తండ్రి పాత్రలో నటించారు. ఆయన టైమింగ్ మాములు టైమింగ్ కాదు. ఆ పాత్రని ఇంకా పెంచండి అని డైరెక్టర్‌తో నేనే చెప్పానంటూ.. ఆయన ఎంత వండర్‌ఫుల్ ఆర్టిస్టో అర్థం చేసుకోవచ్చు. లయ, నేను చాలా మంచి మంచి సినిమాలు చేశాం. నేను లయని చూసి చాలా రోజులు అవుతుంది. ఫస్ట్ రోజు ఆమె సెట్‌లో వచ్చినప్పుడు.. నేను గుర్తు కూడా పట్టలేదు. ఎవరీ కొత్త హీరోయిన్ అనుకున్నాను. 'స్వరాభిషేకం' సమయంలో ఎలా ఉన్నారో, ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఆమెతో మళ్లీ కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. సాయి కార్తీక్ సంగీతం అందరికీ నచ్చుతుంది. సునీల్, వెన్నెల కిషోర్, రఘుబాబు, అలీ వంటి అద్భుతమైన నటీనటులతో చాలా రోజుల తర్వాత కలిసి పని చేశాను. చందు, జీకే ఈ చిత్రానికి ఏం కావాలో అది ఇచ్చి.. చాలా గొప్పగా నిర్మించారు. ఇక రాజేంద్రప్రసాద్‌తో నేను ఎన్నో సినిమాలు చేశాను. మళ్లీ ఆయనతో కలిసి నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రను ఆయన ఎంతో నిజాయితీగా, అంకితభావంతో చేశారు. టెక్నికల్‌గా కూడా సినిమా చాలా బాగుంటుంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?

'రంగస్థలం' చిట్టిబాబుకి, 'పెద్ది'కి ఉన్న తేడా ఏంటంటే?

'అమ్మ'కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy