Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'రంగస్థలం' చిట్టిబాబుకి, 'పెద్ది'కి ఉన్న తేడా ఏంటంటే?

'రంగస్థలం' చిట్టిబాబుకి, 'పెద్ది'కి ఉన్న తేడా ఏంటంటే?

Chitrajyothy 3 weeks ago

'రంగస్థలం'లో రామ్ చరణ్ (Ram Charan) చేసిన చిట్టిబాబు పాత్రకు, 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ చేసిన పాత్రకు ఉన్న తేడా ఏంటో డీవోపీ రత్నవేలు తెలిపారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా రూపుదిద్దుకుంటోన్న రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi). బుచ్చిబాబు సానా దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో డీవోపీ రత్నవేలు (DOP Rathnavelu) మీడియాకు చిత్ర విశేషాలు తెలియజేశారు.

''రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని 'పెద్ది'లో చూడబోతున్నారు. 'పెద్ది' విజువల్ గ్రాండియర్‌తో పాటు ప్రేక్షకుల మనసులను హత్తుకునే సినిమా. ఇందులో నాకు అత్యంత కాంప్లికేటెడ్‌గా అనిపించింది క్రికెట్ మ్యాచ్ సన్నివేశాలు. ఇది స్పోర్ట్స్ బేస్డ్ సినిమా అని తెలిసిందే. కెమెరామెన్‌తో పాటు మొత్తం టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. సినిమాలో వచ్చే సెకండ్ క్రికెట్ మ్యాచ్ చాలా కీలకంగా ఉంటుంది. అది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, కథకు ప్రాణం వంటిది. ఆ మ్యాచ్‌ను రాత్రిపూట షూట్ చేద్దామని నేను బుచ్చిబాబుకి సూచించాను. 80స్‌లో ఫ్లడ్‌లైట్ మ్యాచ్‌లు జరిగేవి. ఆ మూడ్ కోసం నైట్ షూట్ చేస్తే బాగుంటుందని చెప్పగానే, ఆయనకు నా ఆలోచన నచ్చింది. రామ్ చరణ్ కూడా.. అద్భుతమైన ఆలోచన, దీంతో ఈ సినిమా మరో స్థాయికి వెళ్తుందని అన్నారు. ఒక దర్శకుడు, హీరో.. డీవోపీ ఆలోచనని గౌరవించడం చూసి చాలా సంతోషంగా అనిపించింది.

అలాగే కుస్తీ పోటీలు కూడా నాకు మరో పెద్ద ఛాలెంజ్‌గా నిలిచాయి. ఒక గెటప్ అనుకున్న తర్వాత కాస్ట్యూమ్స్, బాడీ మార్చుకుంటే సరిపోతుంది. కానీ ఇందులో రామ్ చరణ్ కుస్తీ సీక్వెన్స్ కోసం తన బాడీలోని ప్రతి మజిల్‌పై వర్క్ చేశారు. ప్రతి మజిల్‌ను డెవలప్ చేసి, ఒక రియల్ పహిల్వాన్‌లా తయారయ్యారు. ఆ విషయం టీజర్, ట్రైలర్‌లో చూసిన వారందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇందులో హనుమంతుడి రిఫరెన్స్‌తో వచ్చే ఓ సీక్వెన్స్ ఉంటుంది. దాని కోసం ఒక ప్రత్యేకమైన లైటింగ్ డిజైన్ చేశాను. ఆ సీక్వెన్స్‌ను ప్రేక్షకులు థియేటర్‌లో చూసినప్పుడు కచ్చితంగా గూస్‌బంప్స్ వస్తాయి. రామ్ చరణ్‌లో ప్రతి ఒక్కరూ ఒక హనుమంతుడిని చూస్తారు. నిజంగా ఇందులో చరణ్ నట విశ్వరూపం చూస్తారు. అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. 'రంగస్థలం'లో చిట్టిబాబు పాత్రను గమనిస్తే.. ఆయన ఎక్కడా కూడా ఆ పాత్రను దాటి బయటకు రారు. 'పెద్ది' విషయానికి వస్తే.. చిట్టిబాబుకి, పెద్దికి ఎమోషనల్‌గా చాలా తేడా ఉంటుంది. రెండు పాత్రలు పూర్తిగా, అసలు కంపేర్ చేయడానికి వీలులేనంత భిన్నంగా ఉంటాయి'' అని డీవోపీ రత్నవేలు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

'అమ్మ'కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!

System Movie Review: సోనాక్షి సిన్హా, జ్యోతిక 'సిస్టమ్‌' ఓటీటీ మూవీ రివ్యూ

హరిరామజోగయ్య కుమారుడిపై గేయ రచయిత అనంత శ్రీరామ్ ఫిర్యాదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy