Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మైథలాజికల్‌ ఫాంటసీ 'జటాయు' వర్కౌట్‌ అవుతుందా!?

మైథలాజికల్‌ ఫాంటసీ 'జటాయు' వర్కౌట్‌ అవుతుందా!?

Chitrajyothy 3 weeks ago

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తారు. గతంలో ఆయన అవుట్‌ ఆఫ్‌ ద బాక్స్ కథలతో తీసిన సినిమాలు పరాజయం పాలు అయ్యాయి. దాంతో ప్రతి సినిమా కథ విషయంలోనూ, నటీనటుల ఎంపిక విషయంలోనూ ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.

అయినా కూడా కొన్ని సినిమాలు ఊహించని ఫలితాలను అందుకుంటున్నాయి.

తాజాగా దిల్‌ రాజు 'జటాయు' పేరుతో ఓ మైథలాజికల్‌ ఫాంటసీ మూవీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విజయ్‌ దేవరకొండతో 'రౌడీ జనార్దన' మూవీ నిర్మిస్తున్న దిల్‌ రాజు... 'జటాయు' సినిమాను సైతం విజయ్‌ తోనే తొలుత ప్లాన్‌ చేశారట. కానీ విజయ్‌ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో ఇప్పుడు ఈ పాత్రను శ్రీకాంత్‌ తనయుడు, 'ఛాంపియన్‌' ఫేమ్‌ రోషన్‌ మేకాతో చేయించబోతున్నట్టు సమాచారం.

'జటాయు' సినిమాను ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించబోతున్నారు. దాదాపు రెండేళ్ళుగా ఆయన ఈ ప్రాజెక్ట్ మీదనే వర్క్‌ చేస్తున్నారట. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఇంద్రగంటి మోహనకృష్ణకు గత కొంతకాలంగా హిట్స్ లేవు. 'సమ్మోహనం' గౌరవప్రదమైన విజయం సాధించింది. అయితే ఆ తర్వాత తీసిన 'వి' సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీనిని దిల్‌ రాజ్‌ నిర్మించారు. 'వి' మూవీ కరోనా టైమ్‌లో రిలీజ్‌ కు సిద్థం కావడంతో తొలుత ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేసి, ఆ తర్వాత ధియేటర్లలో విడుదల చేశారు. ఇదేమంత గొప్ప విజయాన్ని అందుకోలేదు.

కెరీర్‌ ప్రారంభంలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఓ సోషియో ఫాంటసీ మూవీని తెరకెక్కించారు. చలం 'దోషగుణం' కథ ఆధారంగా 'గ్రహణం' మూవీ తెరకెక్కించిన ఇంద్రగంటి ఆ తర్వాత రెండో సినిమాగా 'మాయాబజార్‌'ను తీశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రాజా, భూమిక కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడుదలై పరాజయంపాలైంది. మళ్ళీ ఇప్పుడు ఇంద్రగంటి మోహన కృష్ణ 'జటాయు' పేరుతో మైథలాజికల్‌ ఫాంటసీ మూవీ చేస్తారంటే... జన్‌ జీకి ఈ సినిమా ఎక్కుతుందా? అనే అనుమానాలు నెలకొంటున్నాయి. నిజం చెప్పాలంటే దిల్‌ రాజు తనకు కథ నచ్చకపోతే మూవీని సెట్స్ పైకే తీసుకురారు. కానీ ఆయన 'జటాయు'పై ఇంత ఆసక్తి చూపుతున్నారంటే సమ్‌ థింగ్‌ స్పెషల్ గా ఈ మూవీ ఉంటుందనే విశ్వాసాన్ని సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం... మరి ఏం జరుగుతుందో!

ఇవి కూడా చదవండి:

కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్.. ఇదీ రష్మిక రేంజ్!

టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై దీపికాకు జాన్వీ కౌంటర్!

Tollywood: విజయ దాహార్తి తీర్చని మే మాసం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy