Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై దీపికకు జాన్వీ కౌంటర్!

టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై దీపికకు జాన్వీ కౌంటర్!

Chitrajyothy 3 weeks ago

టాలీవుడ్ సినిమా మేకింగ్ స్టైల్, వర్క్ కల్చర్‌పై బాలీవుడ్ భామల మధ్య సరికొత్త చర్చ నడుస్తోంది. తాజాగా యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సౌత్ సినిమా ఇండస్ట్రీ, ముఖ్యంగా టాలీవుడ్‌లో ఉండే పని వాతావరణాన్ని తెగ పొగిడేసింది.

అయితే ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు పరోక్ష కౌంటర్ లాగా మారడంతో ఇప్పుడు సినీ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా నిలిచింది.

'దేవర' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న జాన్వీ కపూర్ ఇక్కడి వర్క్ కల్చర్‌పై ప్రశంసలు కురిపించింది. 'పెద్ది' (Peddi) ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. ''టాలీవుడ్‌లో వర్క్ కల్చర్ చాలా బాగుంది. ఇక్కడ పని గంటలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా లంచ్ బ్రేక్ సమయంలో నటీనటుల నుంచి టెక్నీషియన్ల వరకు అందరూ కాసేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత మళ్లీ సెట్స్‌పైకి వచ్చి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. నా అనుభవంలో నేను రోజుకు 9 గంటలకు మించి ఎప్పుడూ పని చేయలేదు'' అంటూ టాలీవుడ్ టైం మేనేజ్‌మెంట్‌ను మెచ్చుకుంది. 'దేవర', 'పెద్ది'.. ఈ రెండు సినిమాల సెట్స్‌లో తనకు ఎదురైన మధురమైన అనుభవాలనే ఇలా ఆమె పంచుకుంది.

అయితే, జాన్వీ చేసిన ఈ వ్యాఖ్యలు గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) చేసిన కామెంట్స్‌ను టార్గెట్ చేసినట్లు ఉన్నాయని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. గతంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న 'స్పిరిట్' సినిమాలో ముందు ఆమెకే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నడిచిన కొన్ని కాంట్రవర్సీల అనంతరం సౌత్ మేకింగ్ స్టైల్‌ను ఉద్దేశిస్తూ.. టాలీవుడ్‌లో పని గంటలు చాలా ఎక్కువగా ఉంటాయని, రెస్ట్ లేకుండా కష్టపడాల్సి వస్తుందనే అర్థంలో దీపికా కొన్ని వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు జాన్వీ కపూర్, తను 9 గంటల కంటే ఎక్కువ పని చేయలేదని క్లారిటీ ఇవ్వడం చూస్తుంటే.. టాలీవుడ్‌పై ఉన్న అపోహలను తొలగిస్తూనే, దీపికా వ్యాఖ్యలకు గట్టిగానే పరోక్ష కౌంటర్ ఇచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మొత్తానికి జాన్వీ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ ఇప్పుడు టాలీవుడ్ కల్చర్‌ను మరింత ఎలివేట్ చేస్తోందని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Tollywood: విజయ దాహార్తి తీర్చని మే మాసం!

ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నా.. పవన్‌పై బండ్ల గణేష్ పోస్ట్ వైరల్!

Nbk: బాలయ్య స్పీడ్ మాములుగా లేదుగా.. మరో డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy