Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెగా ర్యాంపేజ్.. ఇంకొన్ని గంటల్లో చిరు, చరణ్ ఒకే స్టేజ్‌పై!

మెగా ర్యాంపేజ్.. ఇంకొన్ని గంటల్లో చిరు, చరణ్ ఒకే స్టేజ్‌పై!

Chitrajyothy 21 hrs ago

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'పెద్ది' (Peddi).

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తూ 'బాక్సాఫీస్ ఛాంపియన్'గా నిలిచింది. థియేటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం సాధించిన ఘన విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్రబృందం ఒక గ్రాండ్ సక్సెస్ మీట్‌ను ప్లాన్ చేసింది. నేడు (జూన్ 23న) హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ 'మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్' ఎంతో వైభవంగా ప్రారంభం కానుంది.

ఈ వేడుకను మరింత స్పెషల్‌గా మార్చడానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటం విశేషం. 'మెగా ర్యాంపేజ్' (MEGA RAMPAGE) పేరుతో విడుదల చేసిన లేటెస్ట్ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ 'ఆచార్య' మూవీలోని మిలిటరీ గ్రీన్ షర్ట్స్‌లో బ్యాక్-టు-బ్యాక్ మాస్ లుక్‌లో కనిపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇంకొన్ని గంటల్లో తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే స్టేజ్‌పై కనిపించబోతుండటంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇద్దరు మెగా హీరోలు ఒకే వేదికపై సందడి చేయనుండటంతో ఈ ఈవెంట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొదటి నుంచి ఈ సినిమాకు చిరంజీవి ఎలాంటి బూస్ట్ ఇస్తూ వస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

వెంకట సతీష్ కిలారు ఎంతో గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్ర సక్సెస్ మీట్ కోసం శిల్పకళా వేదిక పరిసర ప్రాంతాలు ఇప్పటికే మెగా ఫ్యాన్స్ కోలాహలంతో నిండిపోయాయి. ఈ మూవీ యూనిట్ సభ్యులతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'పెద్ది' సినిమా విశేషాలను, అలాగే స్టేజ్ పైన చిరు-చరణ్ పంచుకోబోయే ముచ్చట్లను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సో.. ఈరోజు సాయంత్రం మెగా ర్యాంపేజ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే.. ఇంకొన్ని గంటలు ఓపిక పట్టక తప్పదు!

ఇవి కూడా చదవండి:

కృష్ణవేణి నుంచి నిహారిక, సమంత వరకు... నిర్మాతలుగా మారిన నటీమణులు వీరే!

ఆ ప్రకటనలను నమ్మవద్దు: 'వెంకీఅనిల్5' టీమ్ హెచ్చరిక

మాట నిలబెట్టుకున్న థమన్‌.. ఎంత గొప్ప మనసో!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy