Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాట నిలబెట్టుకున్న థమన్‌.. ఎంత గొప్ప మనసో!

మాట నిలబెట్టుకున్న థమన్‌.. ఎంత గొప్ప మనసో!

Chitrajyothy 3 days ago

సంగీత దర్శకుడు థమన్‌ (S Thaman) ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తన మంచి మనుసును చాటుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) వీరాభిమాని రాజేశ్‌ పిల్లల స్కూల్‌ ఫీజు పూర్తిగా చెల్లించి, వారి చదువుకు అండగా నిలిచారు.

గతేడాది రాజేశ్‌ మరణించారు. అతని కుటుంబం దీనస్థితిని చూసి చలించిపోయిన నిర్మాత ఎస్‌కేఎన్‌ రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చేశారు. ఆ సమయంలో థమన్‌ ఆ పిల్లల చదువు బాధ్యతను తాను తీసుకుంటానని సోషల్‌ మీడియా వేదికగా హామీ ఇచ్చారు. ఆ మేరకు రాజేశ్‌ పిల్లలు శివరామ్‌, సారికశ్రీల స్కూల్‌ ఫీజును చెల్లించారు. అందుకు సంబంధించిన రశీదులను ఎక్స్‌లో పోస్టు చేశారు. 'పాఠశాల విద్య పూర్తయ్యే వరకూ వారి బాధ్యత నాదే. చిన్నారులు రాణించేలా ప్రోత్సహిద్దాం' అని థమన్‌ ఆ పోస్టులో పేర్కొన్నారు.

పవన్, అల్లు అర్జున్.. ఇప్పుడు థమన్

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న థమన్‌ను.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Icon Star Allu Arjun) పేర్ల పక్కన చేర్చుతూ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. చిన్నారి అభిమాని నిరంజన్ కోరికను తీర్చడానికి ఆయన పనులు మానుకొని వరంగల్ వెళ్లి కలిసి ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. నిరంజన్ అడిగిన కుక్కపిల్లను కేవలం అతనిని కలిసి వచ్చిన గంటలోనే నిరంజన్ చేతికి వచ్చేలా చేశారు. ఇక అల్లు అర్జున్ కూడా తన మామలానే మరో చిన్నారి అభిమాని కోరికను తీర్చాడు.

శ్రద్దా అనే చిన్నారి లుకేమియా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆమె అల్లు అర్జున్‌కి పెద్ద ఫ్యాన్. తనకు చనిపోయేలోపు అల్లు అర్జున్‌ని కలవాలని కోరిక. ఇదే విషయాన్ని ఆమె పేరెంట్స్ మేక్ ఏ విష్ అనే సంస్థకు తెలియజేయగా.. వారు అల్లు అర్జున్‌తో మాట్లాడి వీడియో కాన్ఫరెన్స్‌లో శ్రద్దాతో మాట్లాడించారు. బన్నీ సైతం చిన్నారి శ్రద్దాతో సంతోషంగా మాట్లాడారు. పుష్పలోని డైలాగ్‌ని చిన్నారితో పాటు చెప్పించడమే కాకుండా హైదరాబాద్ కూడా రమ్మని ఆహ్వానించారు. అంతేకాకుండా ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

ఇవి కూడా చదవండి:

రుక్మిణి వసంత్‌ మార్ఫింగ్ ఫొటోలు.. ముగ్గురు అరెస్ట్!

హీరోయిన్లను అలా లాగుతున్నాడేంటి? దర్శకేంద్రుడి పై మరోసారి విమర్శలు

Maa Inti Bangaram Movie Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy