Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!

Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!

Chitrajyothy 1 week ago

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని మరోసారి నిరూపిస్తున్నారు. ప్రతి రోజూ మన హద్దులను అధిగమించడానికి లభించే ఒక సరికొత్త అవకాశం అని నమ్మే చిరంజీవి, తన తదుపరి ప్రతిష్టాత్మక చిత్రం 'Mega158' కోసం ఎంతో ఉత్సాహంతో సన్నద్ధమవుతున్నారు.

దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం చిరంజీవి జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆయన సరికొత్త లుక్, బాడీ లాంగ్వేజ్, అంకితభావం చూస్తుంటే.. ఈ సినిమాతో అభిమానులకు మరో భారీ యాక్షన్ విందు ఖాయమనిపిస్తోంది.

ఈ వీడియోలో చిరంజీవి విభిన్న రకాల హెవీ వర్కవుట్స్ చేస్తూ కనిపించారు. 'సమయం ఆ మనిషిని పరీక్షించింది.. కానీ అతని ఆకలిని కాదు' అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో మెగాస్టార్ చూపిస్తున్న కసి, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తోంది. వెయిట్ లిఫ్టింగ్, లెగ్ ప్రెస్, చేతుల వ్యాయామాలు చేస్తూ పూర్తి ఫిట్‌నెస్‌తో ఆయన కనిపిస్తున్న తీరు, యువ హీరోలకు సైతం పోటీనిచ్చేలా ఉంది. వర్కవుట్ ముగిసిన తర్వాత కెమెరా వైపు చూస్తూ చిరంజీవి ఇచ్చిన పవర్‌ఫుల్ లుక్, యాక్షన్ గెట్-రెడీ సైన్ మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. వీడియోలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... ''గెట్టింగ్ రెడీ ఫర్ 158.. బాబీ.. మే 21 ముహూర్తం.. KVN ప్రొడక్షన్స్ వారిది..అంటే ఇంకో నాలుగైదు రోజుల్లో కలుస్తున్నాం. గెట్ రెడీ'' అంటూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేశారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి '#ChiruBobby2' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకోనుంది. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత చిరంజీవి-బాబీ (Director Bobby) కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ముహూర్తం మే 21న అత్యంత వైభవంగా జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే వచ్చిన అనౌన్స్‌మెంట్ పోస్టర్.. ఈ సినిమా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మే 21న మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

లేటు వయసులో ఖరీదైన 'పోర్షే' లగ్జరీ కారు.. సీనియర్ నరేశ్ జల్సానే జల్సా! ఖరీదెంతో తెలుసా?

Chiranjeevi: 'పెద్ది' ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!

Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?

లవ్‌ - రిలేషన్‌పై మిల్కీ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy