Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీరు నిజంగానే పోరాడారు.. 'పెద్ది'పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!

మీరు నిజంగానే పోరాడారు.. 'పెద్ది'పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!

Chitrajyothy 3 weeks ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi).

ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగా ఎదురు చూశారో తెలియంది కాదు. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులెందరో శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ కూడా తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (PKCW) బ్యానర్ తరపున టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలుపుతూ అధికారికంగా ట్వీట్ చేశారు. ఇప్పుడు 'పెద్ది' థియేటర్లలోకి వచ్చి.. సక్సెస్ టాక్‌ని సొంతం చేసుకున్న సందర్భంగా.. యూనిట్ మొత్తానికి అభినందనలు తెలుపుతూ.. సదరు బ్యానర్ నుంచి మరో ట్వీట్ పోస్ట్ అయింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో..

ఈ రోజు విజయం 'పెద్ది' చిత్రానికే సొంతం అని తెలుపుతూ.. ''సరైన ఎమోషన్స్, థియేటర్లలో ఈలలు వేయించేటటువంటి నటనలతో ఒక అందమైన స్పోర్ట్స్ డ్రామాను అందించినందుకు చిత్ర బృందానికి అభినందనలు.

డియర్ రామ్ చరణ్, మీ అద్భుతమైన నటనతో మేమంతా గర్వపడేలా చేశారు. శారీరకంగా, మానసికంగా మీరు మారిన తీరు ఎంతో ప్రశంసనీయం. మీ ఎనర్జీకి సాటిలేదు. 'మీరు నిజంగానే పోరాడారు..'

బుచ్చిబాబు సానా.. సినిమా అంతా బలమైన భావోద్వేగాలను కొనసాగించినందుకు అభినందనలు. దేశంలోని ప్రతి మూలకు చేరాల్సిన ఒక గొప్ప సందేశాన్ని మీరు ఈ చిత్రం ద్వారా అందించారు. మంచి స్క్రిప్ట్‌ను రెడీ చేసినందుకు మిమ్మల్ని, మీ బృందాన్ని అభినందిస్తున్నాను.

ఏఆర్ రెహమాన్.. అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాలోని భావోద్వేగాలను పండించడానికి ఓ సోల్‌గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులు పాటలకు ఎంజాయ్ చేస్తుండటం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. ప్రతి ఫ్రేమ్‌ను రత్నవేలు అత్యంత అందంగా తీర్చిదిద్దారు. అడవులు, పల్లెటూరి అందాలను మేము ఆశ్చర్యపోయేలా చూపించారు. పెద్దలు శివన్న, మీరు గౌర్ నాయుడు పాత్రలో లీనమైపోయారు. 'పెద్ది' ప్రయాణానికి మీ మద్దతు ఎంతో కొనియాడదగినది. అప్పలసూరి పాత్ర కోసం జగపతి బాబు తన సర్వస్వాన్ని అందించడం హృదయాన్ని హత్తుకుంది. నిజంగా, ఆయన కెరీర్‌లోనే ఇది ఒక అత్యుత్తమ నటన అని చెప్పుకోవచ్చు.

బొమాన్ ఇరానీ తన ప్రయాణంలో పెద్దికి అభిమానిగా మారిన విధానం నచ్చింది. స్క్రీన్‌పై మీ పాత్ర ఎంతో ప్రభావవంతంగా ఉంది. జాన్వీ కపూర్ చలాకీతనం.. ఆమెకు ఇంకా సుదీర్ఘమైన భవిష్యత్తు ఉందని నిరూపిస్తోంది. రామ్ బుజ్జి పాత్రకు చాలా సులువుగా జీవం పోసినందుకు దివ్యేందు శర్మకు అభినందనలు. ఈ ఘన విజయం సాధించినందుకు వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలకు అభినందనలు..'' అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

త్రిషకు మెగా కోడలు ఉపాసన స్పెషల్ సర్‌ప్రైజ్‌

'పెద్ది' పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు

NBK 111: 'నో మోర్‌ వింటేజ్‌, ఓన్లీ న్యూ ఏజ్‌'.. సరికొత్త అవతారంలో బాలయ్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy