Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పెద్ది' పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు

'పెద్ది' పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు

Chitrajyothy 3 weeks ago

'నేను ఆడలేదు సారు.. పోరాడాను' అంటాడు 'పెద్ది' (Peddi Movie)లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan). నిజంగానే తెలంగాణ రాష్ట్ర (Telangana State) వ్యాప్తంగా టికెట్ల ధర పెంపు కోసం చిత్ర నిర్మాత పోరాడారు..

విజయం సాధించారు. స్టార్ హీరోల సినిమాల విడుదల నిమిత్తం టికెట్ల రేట్లు పెంపుకు అనుమతి కోరడం, అందుకు ఏదో ఒక అడ్డంకి ఏర్పడటం అనేది తెలంగాణలో కామన్ అయిపోయింది. అనుమతి వచ్చిన తర్వాత కూడా.. ఈ విధానాన్ని ఆపేసిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి.. ఇకపై సినిమా టికెట్ల ధరలు పెంచాలని మా దగ్గరకు రావద్దు.. అంటూ స్ట్రాంగ్‌గా చెప్పిన విషయం తెలిసిందే. కానీ, 'పెద్ది' విషయంలో మాత్రం తెలంగాణ రాష్ట్రం టికెట్ల పెంపుకు లైన్ క్లియర్ చేస్తూ.. జీవో జారీ చేసింది. అందుకే.. అంతా 'పోరాడారు సామి' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన 'పెద్ది' సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విజ్ఞప్తిని పరిశీలించిన హోం శాంఖ మెమో జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లకు ఈ పెంపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. జూన్ 3న రాత్రి 8 గంటలకు 'పెద్ది' స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చింది. ఈ స్పెషల్ షోకు టికెట్ ధర రూ. 600కు (జీఎస్టీతో కలిపి) పెంచుకునే వెసులుబాటు కల్పించింది.

అలాగే సినిమా విడుదల తేదీ నుంచి 10 రోజుల పాటు (ఈ నెల 4 నుంచి 13 వరకు) టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతమున్న టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో రూ.100 చొప్పున, మల్టీప్లెక్స్ ల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు అవకాశమిచ్చింది. వీటితో పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వీలు కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటుకు.. చిత్రయూనిట్ సీఎం రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరల పెంపుకై జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలు 'పెద్ది'కి లైన్ క్లియర్ చేయడంతో.. అభిమానులంతా చాలా హ్యాపీగా ఉన్నారు. అంతేకాదు, 'పెద్ది' రికార్డులు బద్దలు కొట్టబోతున్నాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

NBK 111: 'నో మోర్‌ వింటేజ్‌, ఓన్లీ న్యూ ఏజ్‌'.. సరికొత్త అవతారంలో బాలయ్య

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

Buchibabu Sana: పెద్ది.. ఎన్టీఆర్ కి చెప్పిన కథ కాదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy