Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మొన్ననే కలిసి ఫొటోలు దిగాం.. నమ్మలేకపోతున్నా: భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి

మొన్ననే కలిసి ఫొటోలు దిగాం.. నమ్మలేకపోతున్నా: భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి

Chitrajyothy 0 months ago

ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు కె. భాగ్యరాజ్ (K. Bhagyaraj) మృతి పట్ల చిరంజీవి (Chiranjeevi) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కొన్ని గంటల ముందు ఖుష్బూ కుమార్తె పెళ్లిలో జోకులేసుకుంటూ ఫొటోలు దిగిన సహచరుడు..

సడెన్‌గా మరణించాడనే విషయం తెలిసి హృదయం ముక్కలైందని అన్నారు. అందులోనూ ఆ ఫ్యామిలీతో చిరంజీవికి చాలా మంచి అనుబంధం ఉంది. భాగ్యరాజ్ వైఫ్ పూర్ణిమ.. చిరంజీవి సరసన హీరోయిన్‌గా కూడా నటించారు. 80స్ రీ యూనియన్ పార్టీలో వీరంతా.. ఎంత స్నేహంగా ఉండేవారో తెలియంది కాదు. అలాంటి స్నేహితుడు, సన్నిహితుడు ఇక లేరనే విషయాన్ని.. అసలు చిరంజీవి నమ్మలేకపోతున్నారు. అదే విషయాన్ని తన ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నారు.

''ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నాకు మాటలు రావడం లేదు. మొన్న గోవాలో ఖుష్బూ కుమార్తె పెళ్లి వేడుకలో మేమంతా కలిసి నవ్వుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ, ఫొటోలు దిగుతూ ఎంతో ఆనందంగా గడిపాం. భాగ్యరాజ్ ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా కనిపించారు. అలాంటి ఆయన ఈ ఉదయం ఇక లేరనే వార్త వినడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అద్భుతమైన దర్శకుడిగా, అసాధారణమైన స్క్రీన్‌ప్లే రచయితగా, గొప్ప నటుడిగా భారతీయ సినీ పరిశ్రమకు భాగ్యరాజ్ అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.

ఆయన భార్య పూర్ణిమకు, కుమారుడు శాంతనుకు, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. నా ప్రియమైన మిత్రమా.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మీరు ఎప్పటికీ మా జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు..'' అని చిరంజీవి ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు.

''భాగ్యరాజ్ మరణవార్త నన్ను తీవ్ర విచారానికి గురిచేసింది. ఆయన సృష్టించిన కళాఖండాలు భాషా సరిహద్దులను దాటి కోట్లాది మంది హృదయాలను స్పృశించాయి. ఆయన అద్భుతమైన కథల నుంచి రూపుదిద్దుకున్న 'సుందరకాండ, అబ్బాయిగారు' వంటి సినిమాల్లో నేను భాగమవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భారతీయ సినిమా ఒక గొప్ప దర్శకుడిని కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, కోట్లాది మంది అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను'' అని వెంకటేష్ (Venkatesh) ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

'జననాయగన్‌' నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వం కీలక బాధ్యత!

సీఎంకి కాబోయే భార్యనా.. మజాకానా.. 3 కోట్ల నెక్లెస్ తో త్రిష రచ్చ

జక్కన్న షాక్‌ మాములుగా లేదుగా..! హీరోలు ఇక క్యూ కట్టవచ్చు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy