Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీ కోసమే నాన్న.. రామ్ చరణ్‌కు క్లీంకార పాప అదిరిపోయే సర్‌ప్రైజ్!

నీ కోసమే నాన్న.. రామ్ చరణ్‌కు క్లీంకార పాప అదిరిపోయే సర్‌ప్రైజ్!

Chitrajyothy 2 weeks ago

మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా నటించిన 'పెద్ది' (Peddi) సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సక్సెస్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల (Upasana Konidela), కూతురు క్లీంకార, వారి సిబ్బంది.. అందరూ కలిసి మెగా పవర్‌స్టార్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇంటి గార్డెన్‌లో, ఇంటి లోపల.. స్టాఫ్ అంతా కలిసి 'పెద్ది' సినిమాలోని ఫేమస్ హుక్ స్టెప్పులను రీ-క్రియేట్ చేస్తూ డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సెలబ్రేషన్‌లో హాస్పిటల్ స్టాఫ్, వంట సిబ్బంది, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సినిమాలోని ఐకానిక్ మూమెంట్స్, చరణ్ మాస్ స్టెప్పులను అనుకరిస్తూ వారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చివరిలో రామ్ చరణ్ బాడీగార్డ్‌తో పాటు కొందరు బ్యాట్లు పట్టుకుని చరణ్ స్టైల్లో క్రికెట్ ఆడుతున్నట్టుగా ఫోజులిస్తూ సందడి చేశారు. మెగా హీరోపై తమకున్న అభిమానాన్ని ఈ రకంగా చాటుకుంటూ వారు చేసిన డ్యాన్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

అయితే ఈ వీడియో మొత్తానికి హైలైట్ మాత్రం మెగా ప్రిన్సెస్ క్లీంకార (Klin Kaara) వాయిస్ అనే చెప్పాలి. ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో క్లీంకార తన అమాయకమైన, మధురమైన గొంతుతో ''నాన్నా.. దిస్ ఈజ్ ఫర్ యూ నాన్నా.. ఐ లవ్ యూ సో మచ్'' అంటూ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంటున్నాయి. తండ్రి విజయాన్ని ఇంత చిన్న వయసులోనే ఆ పాప తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకోవడం, ఆ ప్రేమపూర్వకమైన వాయిస్ ఓవర్ ఈ సర్‌ప్రైజ్ వీడియోని 'ది స్వీటెస్ట్ సెలబ్రేషన్'గా మార్చేసింది. ప్రస్తుతం ఈ వీడియోకు మెగాభిమానులు ఫిదా అవుతూ.. వైరల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!

సినిమా రివ్యూ: హీమాన్ అండ్‌ మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్

'పెద్ది' పాత్రను ఎగతాళి చేసే వాళ్లంతా.. ముందు ఇది తెలుసుకోండి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy