Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పెద్ది' పాత్రను ఎగతాళి చేసే వాళ్లంతా.. ముందు ఇది తెలుసుకోండి!

'పెద్ది' పాత్రను ఎగతాళి చేసే వాళ్లంతా.. ముందు ఇది తెలుసుకోండి!

Chitrajyothy 2 weeks ago

''క్రికెట్ ఆడేవాడు కుస్తీ ఏంటి? కుస్తీ నుంచి మళ్ళీ రన్నింగ్ ఏంటి?''.. ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినిమా సర్కిల్స్‌లో 'పెద్ది' సినిమా (Peddi Movie) కథాంశంపై కొంతమంది నెటిజన్లు ఇలా ఎగతాళిగా పోస్ట్‌లు పెడుతున్నారు.

ఒకే వ్యక్తి విభిన్న క్రీడల్లో రాణించడం అసాధ్యమనే కోణంలో ట్రోలింగ్ చేస్తున్నారు. కానీ, క్రీడా చరిత్రను ఒక్కసారి తిరగేస్తే, ఇలాంటి మార్పులు కేవలం సాధ్యమే కాదు.. చరిత్రలో అద్భుతాలు సృష్టించాయని స్పష్టమవుతుంది. సినిమా అనేది సమాజానికి లేదా నిజ జీవితానికి ప్రతిబింబం. ఒక పాత్ర ఒక రంగం నుంచి మరొక రంగానికి మారినప్పుడు దాని వెనుక బలమైన కారణాలు, శారీరక సామర్థ్యం ఉంటాయి.

రామ్ చరణ్ (Ram Charan) చేసిన 'పెద్ది' పాత్రను ఎగతాళి చేసే వారు ఒక క్రీడాకారుడి ప్రతిభను, పట్టుదలను తక్కువగా అంచనా వేస్తున్నట్లే లెక్క. ప్రపంచవ్యాప్తంగా ఒక ఆటలో అగ్రస్థానంలో ఉండి, ఆ తర్వాత పూర్తిగా భిన్నమైన మరొక ఆటలోకి ప్రవేశించి సంచలనాలు సృష్టించిన మహామహులు ఎందరో ఉన్నారు. వారి గురించి తెలిస్తే 'పెద్ది' పాత్ర తీరుతెన్నుల గురించి ఎవరూ కామెంట్ చేయడానికి సాహసించరు. అలాంటి మల్టీ స్పోర్ట్స్ పర్సన్స్ విషయానికి వస్తే..

ఆండ్రూ ఫ్లింటాఫ్ (Andrew Flintoff)

ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిభావంతుడైన ఆల్ రౌండర్లలో ఆండ్రూ ఫ్లింటాఫ్ ఒకరు. యాషెస్ సిరీస్ హీరోగా, మైదానంలో పరుగుల వరద పారించి, వికెట్లు పడగొట్టిన ఈ స్టార్ ఆల్ రౌండర్, క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా? అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. ప్రొఫెషనల్ హెవీవెయిట్ బాక్సర్‌గా రింగ్ లోకి అడుగుపెట్టారు. కఠినమైన శిక్షణ తీసుకుని, బాక్సింగ్‌లో కూడా తన పవర్ ఏంటో నిరూపించుకున్నారు.

జాంటీ రోడ్స్ (Jonty Rhodes)

క్రికెట్ ప్రపంచంలో 'ఫ్లయింగ్ సౌతాఫ్రికన్'గా పేరుగాంచిన జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ విన్యాసాలు అందరికీ గుర్తే. మైదానంలో చిరుతపులిలా దూకుతూ రనౌట్లు, క్యాచ్‌లు పట్టే జాంటీ రోడ్స్, కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, ఒక అద్భుతమైన హాకీ ప్లేయర్ కూడా. 1996 సౌతాఫ్రికా హాకీ ప్లేయర్‌గా ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన రికార్డు కూడా ఆయనకు ఉంది. ఒక అంతర్జాతీయ స్థాయి అథ్లెట్ ఏ క్రీడలోనైనా రాణించగలడనడానికి జాంటీ రోడ్సే సాక్ష్యం.

ఇక 'పెద్ది' విషయానికి వస్తే.. ఊర్లో సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్ ఆడే ఒక సాధారణ యువకుడు. అతనిలో సహజంగానే ఒక మంచి అథ్లెట్ ఉన్నాడు. తన శారీరక బలాన్ని, పట్టుదలను గుర్తించి, అత్యంత కఠినమైన, సాంప్రదాయ క్రీడ అయిన 'కుస్తీ'ని సీరియస్‌గా నేర్చుకుంటాడు. కుస్తీలో రాణించాలంటే అపారమైన స్టామినా, మైండ్ గేమ్ అవసరం. క్రీడాకారుల జీవితాల్లో గాయాలు చాలా సహజం. ఈ క్రమంలో ఒక ఆటగాడికి కాలు సహకరించకపోతే కెరీర్ ముగిసిపోయిందని అందరూ అనుకుంటారు. కానీ, గుండె నిండా పట్టుదల ఉన్నవాడు ఆగిపోడు. కుస్తీకి అవసరమైన భారీ కండరాల బలం తగ్గినా, తనలో ఉన్న రన్నింగ్ సామర్థ్యాన్ని నమ్ముకుని ఆ వైపు అడుగులు వేస్తాడు. ఇది కేవలం సినిమా కథ కాదు.. గాయాల వల్ల తమ క్రీడలను మార్చుకుని ఒలింపిక్స్‌లో మెడల్స్ గెలిచిన ఎందరో రియల్ హీరోల కథ. ఒక క్రీడాకారుడికి బేసిక్ ఫిట్‌నెస్, రన్నింగ్ సామర్థ్యం, మానసిక దృఢత్వం ఉంటే.. అతను ఏ క్రీడనైనా త్వరగా అందిపుచ్చుకోగలడు.

కాబట్టి, స్క్రీన్ మీద 'పెద్ది' చేసే ప్రయాణాన్ని లాజిక్ లేనిదిగా భావించి ఎగతాళి చేసే వాళ్లంతా ముందుగా క్రీడా చరిత్రను, ఒక అథ్లెట్ యొక్క శారీరక పరిణామ క్రమాన్ని తెలుసుకోవాలి. నిజ జీవితంలో ఆండ్రూ ఫ్లింటాఫ్, జాంటీ రోడ్స్ వంటి వాళ్ళు చేసిన విన్యాసాలనే.. మన నేటివిటీకి, ఎమోషన్స్‌కు జోడించి 'పెద్ది' పాత్ర రూపంలో థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఆ పాత్రకు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు కానీ.. ఎగతాళి మాటలతో కామెంట్స్ చేయడం ఆపండి.

ఇవి కూడా చదవండి:

పవన్ కళ్యాణ్‌ని 'దొర' అంటావా.. ప్రకాశ్ రాజ్‌కి ఇచ్చిపడేసిన హేమ!

మీరు నిజంగానే పోరాడారు.. 'పెద్ది'పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!

'డ్రాగన్'లోని ఆ సంచనాల కోసం వెయిటింగ్ -ఎన్టీఆర్

త్రిషకు మెగా కోడలు ఉపాసన స్పెషల్ సర్‌ప్రైజ్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy