Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిన్న ఆలీ.. నేడు రాజీవ్ కనకాల.. ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి!

నిన్న ఆలీ.. నేడు రాజీవ్ కనకాల.. ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి!

Chitrajyothy 3 months ago

టుడు, కమెడియనల్ ఆలీ (Ali) సారీ చెబుతూ ఓ వీడియోను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే.. మరో నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala) కూడా అదే తరహాలో ఓ వీడియోను విడుదల చేసి వార్తలలో హైలెట్ అవుతున్నారు.

సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో చేసే కొన్ని పనులు.. వారికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. రీసెంట్‌గా ఆలీ ఓ సబ్బు యాడ్ (Ali Soap Ad) చేసి ఇబ్బందులు కొనితెచ్చుకున్నారు. ఇప్పుడు రాజీవ్ కనకాల.. ఓ స్కూల్ ఫంక్షన్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరై, లేనిపోని మాటలను పడుతున్నారు. ఆలీ ఓ కమర్షియల్ యాడ్ చేసి చిక్కుల్లో పడితే.. రాజీవ్ కనకాల మాత్రం కేవలం చీఫ్ గెస్ట్‌గా హాజరై వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పుడా వివాదంపై సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే అనేది.. ఏదైనా చేసే ముందు.. వెనుకా ముందు ఆలోచించుకోమని. ఇంతకీ రాజీవ్ కనకాల వివాదం (Rajeev Kanakala School Controversy) ఏమిటంటే..

ఇటీవల ఆయన హైదరాబాద్‌లోని వైబ్రాంట్ అనే స్కూల్‌ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వెళ్లారు. ఆ స్కూల్‌లో ఉత్తీర్ణులైన పిల్లలకు బహుమతులు ఇచ్చేందుకు వెళ్లిన ఆయనకు నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి (NVTS) ఆర్గనైజేషన్ నుంచి షాకింగ్ ఘటన ఎదురైంది. ఆ స్కూల్‌ను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని.. అలాంటి స్కూల్‌కు వెళ్లడమే కాకుండా ఎలా ప్రమోట్ చేస్తారంటూ నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి నిలదీసింది. ఈ అనుకోని ఘటనతో షాక్‌కు గురైన రాజీవ్ కనకాల.. తను ఈ ఈవెంట్‌కు వెళ్లడానికి గల కారణాన్ని తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో..

''నేను వైబ్రాంట్ అనే స్కూల్ ఫంక్షన్‌కి చీఫ్ గెస్ట్‌గా వెళ్లాను. అక్కడ మంచి మార్కులు సంపాదించిన స్కూల్ పిల్లలకు నా చేతుల మీదుగా బహుమతులు ఇవ్వాలని చెప్పగానే.. మంచి కార్యక్రమమే కదా అని చాలా సంతోషంగా అనిపించి వెళ్లాను. అదే సమయంలో ఆ సభలో నవ తెలంగాణ శక్తి (NVTS) ప్రెసిడెంట్ పవన్ నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. 'మీకు ఈ స్కూల్ తాలూకా క్రెడిబిలిటీ మీకు తెలుసా? అన్నీ లీగల్‌గా ఉన్నాయో లేదో మీకు తెలుసా? ఈ రెసిడెన్షియల్ ఏరియాకి పర్మిషన్ ఉందో లేదో మీకు తెలుసా?' అని అడిగారు. నిజంగా నాకు అవన్నీ తెలియదు. ఒక మంచి కార్యక్రమానికి, పిల్లల్ని ఉత్తేజపరిచే కార్యక్రమం కదా అని.. సదుద్దేశంతోనే నేను వెళ్లడం జరిగింది. కాబట్టి.. ఇలాంటి సందేహాలు ఏమైనా ఉంటే.. పేరెంట్స్ అందరూ ఆ స్కూల్ దగ్గరకు వెళ్లి కనుక్కోండి. NVTS వాళ్లు ఏవైతే అడిగారో.. అవన్నీ కనుక్కుని మీ పిల్లల్ని జాయిన్ చేయాలని కోరుతున్నాను. అలాగే.. నేను వైబ్రేంట్ స్కూల్ వాళ్లకి కూడా చెప్పడం జరిగింది. స్కూల్‌కి సంబంధించి నేను హాజరైన ఈవెంట్ ఫొటోలు, వీడియోలు బయటకు రిలీజ్ చేయవద్దని చెప్పాను.

నేను ఆ స్కూల్‌కి వెళ్లింది కేవలం చీఫ్ గెస్ట్‌గా మాత్రమే. ఆ స్కూల్‌ గురించి కాస్త పాజిటివ్‌గా మాట్లాడి ఉంటే ఉండొచ్చు. కాబట్టి వాటిని స్కూల్ ప్రమోషన్ కోసం వాడొద్దని చెప్పడం జరిగింది. నన్ను అలర్ట్ చేసినందుకు ఈ సందర్భంగా NVTS వాళ్లకి కూడా థాంక్స్. ఆ స్కూల్‌పై ఏమైనా డౌట్స్ ఉంటే.. NVTS వాళ్లని కూడా ఆ స్కూల్ యాజమాన్యాన్ని అడగాలని కోరుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి.. ఆ స్కూల్‌తో నాకు సంబంధం లేదు.. నేను చీఫ్ గెస్ట్‌గా మాత్రమే వెళ్లాను అంతే..' అని రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చారు. రాజీవ్ కనకాల వీడియోలో రియాక్ట్ అయిన తీరుపై NTVS కూడా సానుకూలంగా రియాక్టైంది. కాబట్టి.. ఇకపై సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనే విషయం అటు ఆలీ, ఇటు రాజీవ్ ఇన్సిడెంట్స్‌తో తెలుస్తోంది. ఎందుకంటే, ఏ రూపంలోనైనా వివాదం దరిచేరే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా సున్నితమైన అంశాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి, అడుగులు వేయాలనే విషయా ఈ ఘటనలతో వారికి కూడా ఓ క్లారిటీ వచ్చి ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

పరిష్కారం కోసమా? పరువు తీసుకోవడానికా?.. ఇండస్ట్రీ రచ్చపై మధుర శ్రీధర్

అప్పుడు 'హరి హర వీరమల్లు'కి.. ఇప్పుడు 'పెద్ది'కి! - మైత్రీ రవిశంకర్

Prabhas: 'బాహుబలి' ప్రభాస్ చేసిన ఈ పని తెలిస్తే.. ఫ్యాన్ అయిపోవాల్సిందే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy