Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
న్యూ గై ఇన్ టౌన్.. ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్

న్యూ గై ఇన్ టౌన్.. ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్

Chitrajyothy 2 days ago

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky Kudumula) తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం 'ఇట్లు అర్జున' (Itlu Arjuna).

ఆ మధ్య 'న్యూ గై ఇన్ టౌన్' అంటూ ఓ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ న్యూ గైగా అనీష్ (Aniesh) తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న ఈ చిత్రానికి మహేష్ ఉప్పల దర్శకుడు. అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. అక్కినేని నాగార్జున ఇచ్చిన పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ ఈ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత విడుదలైన పోస్టర్లు, 'ఫైండింగ్ అర్జున' అనే స్పెషల్ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టినట్లుగా చెబుతూ.. టీమ్ ఓ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పియానోపై ఓ ట్యూన్ వాయించేందుకు అనీష్ ప్రయత్నిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ 'ఓజీ' థమన్ ఎస్ (Thaman S).. కాఫీ మగ్ చేతిలో పట్టుకుని అతన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య జరిగే ఫన్నీ సంభాషణ ఆకట్టుకుంటోంది. అనీష్ వాయిస్తున్న ట్యూన్‌ను చూసి సరదాగా ఆటపట్టించిన థమన్.. అనంతరం తనదైన శైలిలో మ్యూజికల్ మ్యాజిక్‌ను రివీల్ చేశారు. ఆయన అందించిన సాఫ్ట్ మెలోడీ హంటింగ్ చేస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్‌ను మే 28న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రోమోను చూస్తుంటే.. ఫస్ట్ సింగిల్ ఒక బ్యూటీఫుల్ మెలోడీగా అలరించనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరో పాత్ర చెవిటి, మూగ యువకుడు కావడంతో సంగీతం కథలో మరింత కీలక పాత్ర పోషించనుందని మేకర్స్ చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy